Amritpal Singh: ఖలిస్తాన్ వేర్పాటువాద నేత అమృత్‌పాల్ అరెస్టు!
పంజాబ్ పోలీసులు అతనితో పాటు ఆరుగురు మద్దతుదారులను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ ఉదంతం పంజాబ్‌లో తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసిన నేపథ్యంలో అమృత్‌పాల్ అరెస్టుపై పోలీసులు అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు. రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎస్‌ఎంఎస్, ఇంటర్నెట్ సేవలను నిలిపేశారు. 78 మంది ‘వారిస్ దే’ సంస్థ సభ్యులను అదుపులోకి తీసుకున్నారు.
వీక్లీ కరెంట్ అఫైర్స్ (Persons) క్విజ్ ( 12- 18 ఫిబ్రవరి 2023 )
అసలేం జరిగింది..?
గత నెలలో ఓ కిడ్నాపింగ్ కేసులో అమృత్‌పాల్ అనుచరుడు లవ్‌ప్రీత్‌సింగ్ అలియాస్ తూఫాన్‌సింగ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. దాంతో ఫిబ్రవరి 24న అమృత్‌పాల్ వీరంగమే సృష్టించారు. వేలాదిగా తన అనుచరులతో కలిసి కత్తులు, తుపాకులు చేబూని అమృత్‌సర్ నగర శివార్లలోని అజ్నాలా పోలీస్ స్టేషన్‌పై దాడికి దిగారు. బారికేడ్లను ధ్వంసం చేస్తూ విధ్వంసం సృష్టించారు.
దాంతో విధి లేక లవ్‌ప్రీత్‌ను పోలీసులు వదిలేయాల్సి వచ్చింది! విద్వేష ప్రసంగాలతో యువతను రెచ్చగొట్టారంటూ అమృత్‌పాల్, అతని ఆరుగురు అనుచరులపై కేసు నమోదైంది. మందీమార్బలంతో జలంధర్‌లోని షాకోట్ వెళ్తున్న అమృత్‌పాల్‌ను ఒక్కసారిగా చుట్టుముట్టారు. చాలాసేపు వెంటాడి చివరికి జిల్లా సరిహద్దుల్లోని మెహత్‌ఫర్ సమీపంలో అమృత్‌పాల్‌ను అదుపులోకి తీసుకున్నట్టు చెబుతున్నారు.