Abdul Nazeer: ఏపీ గవర్నర్‌గా జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం
Sakshi Education
ఏపీ గవర్నర్‌గా ఫిబ్రవరి 24వ తేదీ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం చేశారు.
గవర్నర్‌గా జస్టిస్ అబ్దుల్ నజీర్‌తో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ప్రమాణం చేయించారు. ప్రమాణ స్వీకారం అనంతరం రాజభవన్‌లో హై టీ కార్యక్రమం నిర్వహించారు.
సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ అబ్దుల్ నజీర్ స్వస్థలం కర్ణాటక రాష్ట్రం. 1983లో లా డిగ్రీ అనంతరం ఆయన న్యాయవాద వృత్తిలో ప్రవేశించారు. 2003 నుంచి 2017 వరకు కర్ణాటక హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా, న్యాయమూర్తిగా పని చేశారు. 2017లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఆయన పదోన్నతి పొందారు.
Ajay Banga: ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిగా అజయ్ బంగా.. ఈయన చదివింది మన హైదరాబాద్‌లోనే..!
Published date : 25 Feb 2023 10:35AM