Supreme Court: వీఆర్‌ఎస్ తీసుకున్న ఉద్యోగులకు నో పే స్కేల్ రివిజన్
Sakshi Education
స్వచ్ఛంద పదవీ విరమణ(వీఆర్‌ఎస్) తీసుకున్న ఉద్యోగులకు ఆ తర్వాతి కాలంలో వచ్చిన పే స్కేల్ రివిజన్‌లను వర్తింపజేయడం కుదరదని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
మహారాష్ట్ర స్టేట్ ఫైనాన్స్ కార్పోరేషన్‌లో వీఆర్‌ఎస్ తీసుకున్న కొందరు మాజీ ఉద్యోగులు వేసిన పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టు పై విధంగా స్పందించింది. ‘జీతభత్యాల పెంపు, పే స్కేల్ రివిజన్ అనేది పూర్తిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధాన నిర్ణయం. ఉద్యోగుల జీవితాలతో ముడిపడిన అంశమైనందున ఈ విషయం పరిశీలించే బాధ్యత ప్రభుత్వాలదే. ద్రవ్యోల్బణం, జీవన వ్యయాలకనుగుణంగా జీతాలు ఉండాలి’ అని తెలిపింది.
Supreme Court: సుప్రీం జడ్జీలుగా అలహాబాద్, గుజరాత్ హైకోర్టు సీజేలు
Published date : 03 Feb 2023 02:07PM