Veer Bal Diwas: బాబా జోరావర్ సింగ్, బాబా ఫతే సింగల్ బలిదానానికి గుర్తుగా ‘వీర్ బాల్ దివస్’
Sakshi Education
1704వ సంవత్సరంలో మొగలు నవాబ్ అయిన వజీర్ ఖాన్ మతం మారాలంటూ ఇద్దరు షహజాదేలను చిత్రహింసలు పెట్టారు. అయినా ధర్మాన్ని మార్చుకునేందుకు 9 ఏళ్ల జోరావర్ సింగ్, 7 ఏళ్ల ఫతేసింగ్ నిరాకరించారు.
1704 డిసెంబర్ 26న వీరిద్దరు బలిదానం చెందారు. బాబా జోరావర్ సింగ్, బాబా ఫతే సింగల్ సిక్కుల పదవ గురువు గురుగోవింద్ సింగ్ చిన్న కుమారులు(సాహెబ్‌జాదేలు). వీరి ధైర్య, సాహసాలను, త్యాగాలను స్మరించుకుంటూ ఈ ఏడాది నుంచి ప్రతి ఏటా డిసెంబర్ 26న ‘వీర బాల్ దివస్’ కార్యక్రమం నిర్వహించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం నిశ్చయించింది.
ఇందులో భాగంగా డిసెంబర్ 26న(సోమవారం) ఢిల్లీలో వీర బాల్ దివస్‌ను పురస్కరించుకుని ఘనంగా ‘షాబాద్ కీర్తన్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు పాల్గొననున్నారు. 2022 జనవరి 9న శ్రీ గురు గోవింద్ సింగ్ జయంతి సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ప్రధాని మాట్లాడుతూ.. డిసెంబర్ 26ను ‘వీర్ బాల్ దివస్’గా నిర్వహించనున్నట్లు ప్రకటించారు.
వీక్లీ కరెంట్ అఫైర్స్ (ముఖ్యమైన తేదీలు) క్విజ్ (03-09 డిసెంబర్ 2022)
Published date : 26 Dec 2022 01:47PM