Skip to main content

Sainik Schools: దేశవ్యాప్తంగా కొత్తగా ఎన్ని సైనిక పాఠశాలలు ఏర్పాటు కానున్నాయి?

Sainik Schools

దేశవ్యాప్తంగా 100 సైనిక పాఠశాలలను కొత్తగా ఏర్పాటు చేయాలని కేంద్ర కేబినెట్‌ నిర్ణయించింది. అక్టోబర్‌ 12న ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ భేటీ ఈ మేరకు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. 2022–23 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం కానున్న కొత్త సైనిక పాఠశాలల్లో 6వ తరగతిలో 5వేల మంది విద్యార్థులను చేర్చుకుంటారు. వీటి ఏర్పాటులో రాష్ట్రాలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేట్‌ సంస్థలకు అవకాశం కల్పించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 33 సైనిక పాఠశాలల్లో 6వ తరగతి విద్యార్థులు 3వేల మంది ఉన్నారు.

మరోవైపు స్వచ్ఛ భారత్‌ మిషన్‌ (అర్బన్‌) అటల్‌ మిషన్‌ 2025–26 వరకు కొనసాగించాలని కేబినెట్‌ నిర్ణయించింది. పట్టణ పరివర్తన, పునరుజ్జీవనకు అటల్‌ మిషన్‌ ఫర్‌ రెజునవేషన్, అర్బన్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ (అమృత్‌) 2.0ను 2025–26 వరకు సాగించేందుకు ఆమోదం తెలిపింది. 
 

చ‌ద‌వండి: చిన్నారుల కోసం అందుబాటులోకి రానున్న రెండో వ్యాక్సిన్‌?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : 100 సైనిక పాఠశాలలను కొత్తగా ఏర్పాటు చేయాలని నిర్ణయం
ఎప్పుడు  : అక్టోబర్‌ 12
ఎవరు    : కేంద్ర కేబినెట్‌
ఎక్కడ    : దేశవ్యాప్తంగా...

 

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్

Published date : 13 Oct 2021 03:18PM

Photo Stories