Skip to main content

Bilkis Bano Case: బిల్కిస్‌ బానో కేసు దోషులకు ఏ ప్రాతిపదికన శిక్ష తగ్గించారు.. కేంద్రం, గుజరాత్‌ సర్కారుకు సుప్రీం ప్రశ్న?

బిల్కిస్‌ బానో కేసులో 11 మంది దోషులకు గుజరాత్‌ ప్రభుత్వం శిక్ష తగ్గించడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది.

‘ఆ నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? శిక్ష తగ్గించే ముందు నేర తీవ్రత దృష్ట్యా కాస్త బుర్ర ఉపయోగించి ఉండాల్సింది’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. నేర తీవ్రతను ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదంటూ నిలదీసింది. ‘ఓ గర్భిణిపై అతి హేయంగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె కుటుంబీకులెందరినో దారుణంగా హత్య చేశారు. ఈ రోజు బానో బాధితురాలు. రేపు ఇంకెవరైనా కావచ్చు. మీరు, నేను కూడా కావచ్చు!’ అని కేంద్రాన్ని, గుజరాత్‌ ప్రభుత్వాన్ని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో దోషుల విడుదలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను న్యాయమూర్తులు జస్టిస్‌ కె.ఎం.జోసెఫ్, జస్టిస్‌ బి.వి.నాగరత్న ధర్మాసనం ఏప్రిల్ 18న‌ విచారించింది. దోషులకు ఇష్టమొచ్చినట్టు పెరోల్‌ మంజూరు చేశారంటూ విస్మయం వ్యక్తం చేసింది.

Atiq Ahmed shootout: అతీక్‌ సోదరుల హత్య.. ఇద్దరి తలల్లోకి దూసుకెళ్లిన తూటాలు!


‘ఒకరికి ఏకంగా 1,000 రోజుల పెరోల్‌ ఇచ్చారు. అంటే మూడేళ్లు. మరొకరికి 1,200 రోజులు, ఇంకొకరికి 1,500 రోజులిచ్చారు! అసలు మీరు ఏ విధానాన్ని అనసరిస్తున్నారు?’ అంటూ గుజరాత్‌ ప్రభుత్వాన్ని నిలదీసింది. ‘ఇది కేవలం ఓ సాధారణ హత్య కేసు కాదు. హత్యలు, పైపెచ్చు సామూహిక అత్యాచారానికి సంబంధించిన కేసు. ఓ జనహననాన్ని మామూలు హత్యలా చూడలేం’ అంటూ తలంటింది. ఇలాంటి కేసులో దోషులను విడుదల చేయడం ద్వారా సమాజానికి ఎలాంటి సందేశమిస్తున్నదీ చూసుకోవాల్సిన అవసరం చాలా ఉందని పేర్కొంది. శిక్ష తగ్గింపున‌కు కారణాలు చూపకపోతే తమ అవగాహన ప్రకారం ఓ నిర్ణయానికి రావాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. తాము ఆదేశించినా శిక్ష తగ్గింపు తాలూకు రికార్డులను సమర్పించకపోవడంపై ఆగ్రహం వెలిబుచ్చింది. దీన్ని ధిక్కార నేరంగా పరిగణించాల్సి ఉంటుందని కేంద్రం, గుజరాత్‌ ప్రభుత్వం తరఫున హాజరైన అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఎస్‌.వి.రాజును హెచ్చరించింది.

వీక్లీ కరెంట్ అఫైర్స్ (ముఖ్యమైన తేదీలు) క్విజ్ (12-18 మార్చి 2023)


దోషి ఒక మంచి కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్త అనే కారణంతో శిక్ష తగ్గిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని 2006లో సుప్రీంకోర్టు కొట్టేసిందని జస్టిస్‌ జోసెఫ్‌ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ‘అందుకే శిక్ష తగ్గింపుకు కారణాలేమిటో తెలుసుకోదలచాం. ఇది నేర తీవ్రతను దృష్టిలో ఉంచుకుని మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాలు వాడాల్సిన సున్నితమైన అధికారం. ఈ విషయంలో సుప్రీంకోర్టు పొందుపరిచిన మార్గదర్శకాలను పాటించి తీరాల్సిందే’ అని ఆయన స్పష్టం చేశారు. ప్రతివాదులంతా మే 1లోగా ప్రతిస్పందనలు సమర్పించాలని ధర్మాసనం ఆదేశించింది. విచారణను మే 2కు వాయిదా వేసింది.  

National Party: ఓ రాజకీయ పార్టీని జాతీయ పార్టీగా గుర్తించాలంటే ఉండాల్సిన అర్హతలివే..

Published date : 19 Apr 2023 06:11PM

Photo Stories