Supreme Court of India : అబార్షన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. భర్త బలవంతం చేసినా అది అత్యాచారమే..
అవాంఛిత గర్భాన్ని తొలగించుకునేందుకు మహిళ వైవాహిక స్థితిని ప్రామాణికంగా పరిగణించలేమని తెలిపింది. పెళ్లితో సంబంధం లేకుండా అబార్షన్ చేయించుకునే హక్కు మహిళకు ఉందని తెలిపింది.
పెళ్లి కాని మహిళలు కూడా అబార్షన్ చేయించుకోవచ్చని పేర్కొంది.గర్భం దాల్చిన 24 వారాల వరకు మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ (ఎంటీపీ) చట్టం ప్రకారం అబార్షన్‌కు అనుమతినిచ్చింది.
భర్త బలవంతం చేసినా అది అత్యాచారమే..
అదే విధంగా భర్త బలవంతం చేసినా అది అత్యాచారమే అవుతుందని సుప్రీం తీర్పునిచ్చింది. వైవాహిక అత్యాచారం నేరంగా పరిగణించాలన్న సుప్రీంకోర్టు.. దాని ద్వారా కలిగే గర్భాన్ని కూడా అబార్షన్ చేసుకునే అధికారం మహిళలకు ఉందని తెలిపింది. ప్రతి భారతీయ మహిళ తనకు నచ్చినది ఎంచుకునే హక్కు ఉందని, కేవలం వివాహిత స్త్రీలే శృంగారం చేయాలని నిబంధన ఏమీ లేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.
ఓ కేసు విచారణలో భాగంగా..
మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీకి (ఎంటీపీ) సంబంధించిన ఓ కేసు విచారణలో భాగంగా సుప్రీంకోర్టు ఈ విధంగా వ్యాఖ్యానించింది. ‘పెళ్లిన వారిని 24 వారాల లోపు అబార్షన్‌కు అనుమతిస్తూ, పెళ్లి కాని వారిని అనుమతించకపోవడం సరికాదు. కాలం మారిందిచట్టం స్థిరంగా ఉండకూడదు. మారుతున్న సామాజిక వాస్తవాలకు అనుగుణంగా నిబంధనలు మారుతుంటాయి’ అని కోర్టు స్పష్టం చేసింది.