Supreme Court: ఇటీవల సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ఎవరు నియమితులయ్యారు?
Sakshi Education
సుప్రీంకోర్టుకు కొత్తగా ఇద్దరు న్యాయమూర్తులు నియమితులయ్యారు. దీంతో దేశ అత్యున్నత న్యాయస్థానం పూర్తి స్థాయిలో 34 మంది జడ్జీలతో పనిచేయనుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వీ రమణ నేతృత్వంలోని కొలీజియం చేసిన సిఫారసులకు కేంద్ర న్యాయశాఖ రెండు రోజుల్లోనే ఆమోదం తెలిపింది. ఈ మేరకు. గువాహటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుధాన్షు ధులియా, గుజరాత్ హైకోర్టుకు చెందిన జస్టిస్ జంషెడ్ బి పార్దివాలాల నియామకాలను ఆమోదిస్తూ రెండు వేర్వేరు నోటిఫికేషన్లు విడుదల చేసింది. వచ్చే వారం వీరిద్దరూ బాధ్యతలు స్వీకరించిన తర్వాత సుప్రీంకోర్టు పూర్తి సామర్థ్యంతో 34 మంది జడ్జీలతో పనిచేయనుంది.
Healthcare Services: వైద్య సేవలు ఏ చట్టం పరిధిలోకి వస్తాయని సుప్రీంకోర్టు తెలిపింది?
Published date : 16 May 2022 07:33PM