MediaOne Channel: వార్తా చానల్ ‘మీడియావన్’పై నిషేధం ఎత్తివేత
నిజానిజాలు సరిచూసుకోకుండానే నిషేధాజ్ఞలు అమలుచేశారంటూ కేంద్ర హోం శాఖను తప్పుబట్టింది. మీడియాపై అకారణంగా నిషేధం అమలుచేస్తే పత్రికా స్వేచ్ఛకు విఘాతం కలుగుతుందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది. నిషేధాన్ని సమర్తిస్తూ గతంలో కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేసింది. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలుచేసింది.
వీక్లీ కరెంట్ అఫైర్స్ (జాతీయ) క్విజ్ (26 ఫిబ్రవరి - 04 మార్చి 2023)
‘ప్రభుత్వ విధానాలను తప్పుబడుతూ చేసిన విమర్శలను దేశ వ్యతిరేక చర్యలుగా చిత్రీకరించవద్దు. ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛ అత్యంత ప్రధానం. పాలనపై వాస్తవాలు వెల్లడించే మీడియా ద్వారా పౌరులు ఒక అభిప్రాయానికొస్తారు. సరైన నిర్ణయాలు తీసుకునే ప్రజల ద్వారానే ప్రజాస్వామ్యం సరైన పథంలో ముందుకు సాగుతుంది. ఏకధృవ పోకడలు, అభిప్రాయాలు ప్రజాస్వామ్యానికి కీడు చేస్తాయి. ఛానెల్ లైసెన్స్‌ను రెన్యువల్ చేయకపోవడం భావ ప్రకటన స్వేచ్ఛపై ఆంక్షలు విధించడమే’ అని అభిప్రాయపడింది.
నిషేధానికి కారణాలను సీల్డ్‌కవర్‌లో కోర్టుకు మాత్రమే తెలియజేయడం సహజ న్యాయసూత్రాన్ని ఉల్లంఘించడమేనని న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ అన్నారు. మీడియావన్ వార్తలను తప్పుబడుతూ భద్రతా కారణాలతో 2022 జనవరి 31న కేంద్రం దానిపై నిషేధం విధించింది. చానల్ దాన్ని కేరళ హైకోర్టులో సవాలు చేయగా కేంద్రం నిర్ణయాన్ని సమర్థించింది. దాంతో చానల్ సుప్రీంను ఆశ్రయించింది.