Skip to main content

PM Modi: సింగిల్‌ బ్రాండ్‌తో అన్ని సబ్సిడి ఎరువులు

Prime Minister Launches 'One Nation One Fertiliser' Scheme

కేంద్ర ప్రభుత్వం.. ప్రధాన మంత్రి భారతీయ జన్‌ ఉర్వరక్‌ పరియోజన కింద ’వన్‌ నేషన్‌ –వన్‌ ఫెర్టిలైజర్‌’ అనే కొత్త పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద అన్ని సబ్సిడీ ఎరువులను ఒకే బ్రాండ్‌ కింద మార్కెట్‌ చేయడం తప్పనిసరి చేశారు. ఈ మేరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. పీఎం కిసాన్‌ సమ్మేళన్‌ –2022 సందర్భంగా జరిగిన రెండు రోజుల కార్యక్రమంలో సింగిల్‌ బ్రాండ్‌ భారత్‌ పేరుతో ఈ కొత్త పథకాన్ని ప్రారంభించారు. సబ్సిడీ ఎరువుల అక్రమ తరలింపునకు చెక్‌పెట్టేలా ఈ పథకాన్ని తీసుకువచ్చారు. యూరియా, డి అమ్మెనియా ఫాస్ఫేట్‌(డీఏపీ), మ్యూరియేట్‌ ఆఫ్‌ పొటాష్‌(ఎంఓపీ), ఎన్‌ పీకే వంటివి ఒకే బ్రాండ్‌ కింద విక్రయాలు జరుగుతాయి. అంతేగాక సుమారు 600 పీఎం కిసాన్‌ సమృద్ధి కేంద్రాలను (పీఎంకేఎస్‌కే) కూడా ప్రారంభించారు. ఇవి రైతులకు వ్యవసాయానికి సంబంధించిన అన్ని రకాల ఉత్పత్తులు అందిచడమే కాకుండా బహుళ సేవలను అందించే ఒక షాపుగా పనిచేస్తుంది.

October Weekly Current Affairs (National) Bitbank: Which state has become the first digitally literate gram panchayat?

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 28 Oct 2022 05:02PM

Photo Stories