IIM & IIT: ఐఐఎం, ఐఐటీలు జాతికి అంకితం
ఫిబ్రవరి 20వ తేదీ జమ్మూకాశ్మీర్ నుంచి ప్రధాని పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఉమ్మడి ఏపీ విభజన హామీల్లో భాగంగా కేంద్ర విద్యాసంస్థల్లో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ విశాఖ క్యాంపస్‌ను వర్చువల్‌గా ప్రారంభించారు. అలాగే తిరుపతి ఐఐటీ, తిరుపతి ఐఐఎస్‌ఈఆర్ (ఇండియన్ ఇన్‌స్టిటూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ రీసెర్చ్), కర్నూలులో ఏర్పాటు చేసిన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ అండ్ మ్యానుఫాక్చరింగ్(ఐఐఐటీడీఎం), ఐఐఐటీ (శ్రీసిటీ) సంస్థలకు సంబంధించిన శాశ్వత భవనాలను నరేంద్ర మోదీ వర్చువల్‌గా జాతికి అంకితం చేశారు. ఈ కార్యక్రమంలో సీఎస్ డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి, ఉన్నత విద్యామండలి చైర్మన్ కే హేమచంద్రారెడ్డి తధితరులు పాల్గొన్నారు.