Skip to main content

All India Radio: ‘ఆల్‌ ఇండియా రేడియో’కు స్వస్తి

All India Radio

రేడియో ప్రసారాల సమయంలో.. ఇకపై ‘ఆకాశవాణి’ అన్న పేరు మాత్రమే ఉపయోగించాలని ఆకాశవాణి డీజీ వసుధా గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. రేడియోల్లో ప్రకటనల సమయంలో, ఇతర అధికార వర్తమానాల్లో ఆకాశవాణి పేరును మాత్రమే ఉపయోగించాలని నిర్దేశించారు. ఇంగ్లిష్‌ ప్రసారాల సమయంలో కూడా ‘దిస్‌ ఈజ్‌ ఆల్‌ ఇండియా రేడియో’ అని కాకుండా.. ‘దిస్‌ ఈజ్‌ ఆకాశవాణి’ అని మాత్రమే ఉపయోగించాలని ఆదేశించారు. అన్ని భాషలు, మాండలికాల్లోనూ ఇదే నిబంధనను అనుసరించాలని నిర్దేశించారు.

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 20 May 2023 06:38PM

Photo Stories