Union Labor Minister: మూడేళ్లలో లక్షకుపైగా వేతన జీవులు ఆత్మహత్య
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(ఎన్ సీఆర్బీ) గణాంకాలను ఆయన వెల్లడించారు. 2019 నుంచి 2021 వరకు మూడేళ్లలో అసంఘటిత రంగాలకు చెందిన మొత్తం 1.12 లక్షల మంది రోజువారీ వేతన కార్మికులు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. ఈ మూడేళ్లలో 31,839 మంది రైతులు, వ్యవసాయ కూలీలతోపాటు 35,950 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నట్లు పేర్కొన్నారు. కాగా, అసంఘటిత కార్మికుల సామాజిక భద్రతా చట్టం 2008 కింద రోజువారీ వేతన కార్మికులు, అసంఘటిత రంగంలోని కార్మికుల సంక్షేమం కోసం అనేక పథకాలు రూపొందించినట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ తెలిపారు. వీటి ద్వారా జీవిత, సామాజిక భద్రత కల్పించడంతోపాటు ఆరోగ్యం, ప్రసూతి ప్రయోజనాలు, దివ్యాంగుల రక్షణ, వృద్ధాప్య రక్షణ వంటి ప్రయోజనాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన ద్వారా జీవిత బీమా అందిస్తున్నట్లు వెల్లడించారు. 2022 డిసెంబర్ 31 నాటికి 14.82 కోట్ల మంది లబ్ధిదారులు ఈ పథకాల కింద నమోదు చేసుకున్నట్లు వివరించారు.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP