Anti Conversion Law: మతమార్పిడి నిరోధక చట్టం రద్దు.. ఏ రాష్ట్రంలో అంటే..?
Sakshi Education
గత బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన మత మార్పిడి నిరోధక చట్టాన్ని రద్దు చేస్తామని కర్ణాటక రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది.
జూలైలో జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో ఇందుకు సంబంధించిన బిల్లును ప్రవేశపెడతామని సీఎం సిద్ధరామయ్య ప్రభుత్వం తెలిపింది.
‘మత మార్పిడి నిరోధక బిల్లుపై మంత్రివర్గం చర్చించింది. 2022లో బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పులను రద్దు చేసేందుకు ఉద్దేశించిన బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. జూలై 3 నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో దీనిని ప్రవేశపెడతాం’ అని రాష్ట్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి హెచ్‌కే పాటిల్ జూన్ 15న తెలిపారు. సామూహికంగా, తప్పుడుమార్గాల్లో బలవంతంగా చేపట్టే మత మార్పిడులను శిక్షార్హం చేస్తూ గత ఏడాది సెప్టెంబర్‌లో బీజేపీ ప్రభుత్వం చట్టం చేశారు.
Ayodhya: ‘అయోధ్య’ తొలి అంతస్తు దాదాపు పూర్తి.. వివరాలు వెల్లడించిన ట్రస్ట్
Published date : 16 Jun 2023 12:09PM