Skip to main content

Scheme for Women: మహిళలకు శుభవార్త.. సంక్షేమ పథకం ద్వారా ఏటా రూ.12,000

మహిళల సంక్షేమం కోసం జార్ఖండ్‌లోని హేమంత్ సోరెన్ సర్కారు నూతన పథకాన్ని ప్రకటించింది.
Maiya Samman Yojana provides Rs 12,000 annually to women in Jharkhand  Jharkhand Chief Minister Hemant Soren launching Maiya Samman Yojana  Jharkhand Governments Special Scheme for Women  Hemant Soren government announces Maiya Samman Yojana for women in Jharkhand

ఈ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం 21 నుంచి 50 ఏళ్లలోపు మహిళలకు ప్రతి సంవత్సరం రూ.12,000 అందజేస్తుంది. ఈ పథకానికి ‘మైయా సమ్మాన్ యోజన’ అని పేరు పెట్టారు. ఈ ఏడాది చివర్లో జార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
 
ఈ పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం ముమ్మరంగా కసరత్తు ప్రారంభించింది. అర్హులైన మహిళలను ఎంపిక చేసేందుకు రాష్ట్ర మహిళా, శిశు అభివృద్ధి, సామాజిక భద్రత శాఖ పలు ప్రాంతాల్లో క్యాంపులను నిర్వహిస్తోంది. జార్ఖండ్ ఏజెన్సీ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈ పథకానికి సంబంధించిన పోర్టల్‌ను సిద్ధం చేసింది. రాష్ట్రంలోని మహిళల అభ్యున్నతికి ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని మహిళా, శిశు అభివృద్ధి, సామాజిక భద్రత శాఖ కార్యదర్శి మనోజ్ కుమార్ పేర్కొన్నారు.

రాష్ట్రంలోని సుమారు 50 లక్షల మంది మహిళలకు ఈ పథకం కింద లబ్ధి చేకూరనుంది. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకంకింద ప్రయోజనం పొందేందుకు ఏ ఇతర పెన్షన్ స్కీమ్ ద్వారా ప్రయోజనం పొందని మహిళలు అర్హులు. జార్ఖండ్ నివాసితులకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. ఈ పథకానికి సంబంధించిన దరఖాస్తు ఫారాలు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి. దరఖాస్తులను ఆగస్టు 21 నుంచి పోర్టల్ ద్వారా సమర్పించవచ్చని ప్రభుత్వం తెలిపింది. 

Child Marriages: బాల్య వివాహాల్లో ముందున్న రాష్ట్రాలు ఇవే..

Published date : 05 Aug 2024 02:58PM

Photo Stories