INS Sandhayak: ‘ఐఎన్‌ఎస్ సంధాయక్’ జాతికి అంకితం
Sakshi Education
‘ఐఎన్‌ఎస్ సంధాయక్’ నౌకను ఫిబ్రవరి 3న జాతికి అంకితం చేశారు. ఇందుకోసం తూర్పు నౌకాదళ ముఖ్య కార్యాలయం ఆధ్వర్యంలో విశాఖలోని నేవల్ డాక్యార్డులో ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. నౌకాదళ ఉపయోగార్థం హైడ్రోగ్రాఫిక్ సర్వే జరిపేందుకు కేంద్ర రక్షణ మంత్రిత్వశాఖ ఆదేశాలతో కోల్‌కతాలోని ‘గార్డెన్ రీచ్ షిప్ బిల్డింగ్ ఇంజినీర్స్ (జీఆర్‌ఎస్‌ఈ) సంస్థ’.. ఐఎన్ ఎస్ సంధాయక్‌ను నిర్మించింది. 2021, డిసెంబరు 5న జలప్రవేశం చేయించి.. పనులు పూర్తి చేశారు. ఈ నౌక 3,800 టన్నుల సామర్థ్యంతో 110 మీటర్ల పొడవుంది. దీనిపై ఓ హెలిపాడ్, సర్వే సాంకేతిక పరికరాలు, రెండు డీజిల్ యంత్రాలు అమర్చారు.
Published date : 16 Feb 2024 03:32PM