Indian Navy: నేవీ అడ్వాన్స్‌డ్ లైట్‌హెలికాప్టర్ జాతికి అంకితం
Sakshi Education
భారత నౌకాదళ వాయు కేంద్రం ‘ఐఎన్ ఎస్ డేగా’లో అడ్వాన్స్‌డ్ లైట్æహెలికాప్టర్(ఏఎల్‌హెచ్)కు సంబంధించిన తొలి స్క్వాడ్రన్ ను తూర్పు నౌకాదళాధిపతి, వైస్ అడ్మిరల్ బిశ్వజిత్ దాస్‌గుప్తా జాతికి అంకితం చేశారు. ఈ హెలికాప్టర్లను దేశీయంగా హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌లో రూపొందించారు. తూర్పు తీరంలో నిఘాకు, సహాయ చర్యలు చేపట్టేందుకు ఈ లోహ విహంగం ఉపయోగపడుతుంది. ఏఎల్‌హెచ్ తొలి స్క్వాడ్రన్ కు ‘క్రెస్ట్రల్స్’ అని నామకరణం చేశారు. ‘చిట్టి డేగ’ అని దీని అర్థం. దీన్ని అత్యవసర వైద్య సదుపాయానికి ఎయిర్ అంబులెన్సుగా వినియోగిస్తారు.
GK National Quiz: 'సెమికాన్ ఇండియా కాన్ఫరెన్స్-2022'ను ప్రధాని నరేంద్ర మోదీ ఎక్కడ
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
Published date : 16 Jul 2022 07:16PM