India Political Parties Donations : భారతదేశంలో వివిధ పార్టీలకు వచ్చిన విరాళాలు ఇవే.. : ఏడీఆర్
అంతకు ముందు ఆర్థిక సంవత్సరంతో పోల్చి చూస్తే 41.49% తగ్గాయని తెలిపింది. కరోనా లాక్‌డౌన్‌ల ప్రభావంతో విరాళాల్లో భారీగా తగ్గుదల కనిపించింది. 2020 ఆర్థిక సంవత్సరం ప్రారంభం కావడానికి ముందే మార్చిలో దేశంలో కరోనా కేసులు వెలుగులోకి వచ్చి లాక్‌డౌన్‌కు దారి తీసిన విషయం తెలిసిందే.
అధికార పార్టీ బీజేపీకి 39% తగ్గిన విరాళాలు..
బీజేపీకి 2019–20 ఆర్థిక సంవత్సరంలో రూ.785.77 కోట్ల విరాళాలు అందితే, 2020–21కి వచ్చే సరికి రూ.477.54 కోట్లు వచ్చాయి. 2018–19 ఆర్థిక సంవత్సరంతో పోల్చి చూస్తే బీజేపీకి ఆ తర్వాత ఆర్థిక సంవత్సరంలో విరాళాలు 5.88% పెరిగాయి. మళ్లీ ఇప్పుడు 39.23% తగ్గిపోయాయి.
చదవండి: Quiz of The Day(July 14, 2022) >> ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయాలు, ఎన్నికలలో పాల్గొనడాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది?
కాంగ్రెస్ విరాళాల్లో 46% తగ్గుదల.. కారణం.. ?
కాంగ్రెస్ పారీ్టకి వచి్చన విరాళాల్లో 46.39% తగ్గుదల కనిపించింది. 2019–20 ఆర్థిక సంవత్సరంలో ఆ పారీ్టకి రూ.139.016 కోట్లు విరాళాలు వస్తే, 2020–21 నాటికి రూ.74.524 కోట్లు వచ్చాయి. అంతకు ముందు ఏడాదిలో 6.44% విరాళాలు తగ్గినట్టుగా ఏడీఆర్ నివేదిక స్పష్టం చేసింది. మాయావతికి చెందిన బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) రూ.20 వేల కంటే ఎక్కువ విరాళాలు రాలేదని చెప్పుకుంది. గత పదిహేనేళ్లుగా బీఎస్పీకి అంతకు మించి విరాళాలు అందడం లేదని స్పష్టం చేసింది.
విరాళాలివ్వడంలో ఢిల్లీ టాప్..
విరాళాలు ఇవ్వడంలో ఢిల్లీ అగ్రస్థానంలో ఉంది. ఢిల్లీ నుంచి రూ.246 కోట్లు విరాళాలుగా అందితే, , మహారాష్ట్ర రూ.71.68 కోట్లతో రెండో స్థానంలోనూ, రూ.47 కోట్లు విరాళాలు ఇచ్చి గుజరాత్ మూడో స్థానంలో ఉన్నాయి. ఇక మొత్తం విరాళాల్లో 80శాతం (రూ.480 కోట్లు) కార్పోరేట్ రంగం నుంచి వస్తే, వ్యక్తిగతంగా 2,258 మంది రూ.111.65 కోట్లు విరాళంగా ఇచ్చారు.
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్