Skip to main content

Single-Use Plastic Ban: 16 రకాల ప్లాస్టిక్‌ వస్తువులపై నిషేధం

Single-Use Plastic Ban: ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్‌ వస్తువులను ఎప్పటి నుంచి నిషేధించనున్నారు?
India bans single-use plastic items from 1st July
India bans single-use plastic items from 1st July

ఒకసారి వాడి పారేసే 16 రకాల ప్లాస్టిక్‌ వస్తువులను జూలై 1వ తేదీ నుంచి నిషేధిస్తున్నట్లు కేంద్ర పర్యావరణ,అటవీ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇయర్‌బడ్స్, క్యాండీ, ఐస్‌క్రీంల కోసం వాడే ప్లాస్టిక్‌ పుల్లలు, ప్లాస్టిక్‌ ప్లేట్లు, కప్పులు, గ్లాసులు, ఫోర్క్‌లు, చెంచాలు, కత్తులు, ట్రేలు, ప్లాస్టిక్‌ స్వీట్‌బాక్సులు, ఆహ్వానపత్రాలు, సిగరెట్‌ ప్యాకెట్లు, 100 మైక్రాన్‌ లలోపు ఉండే పీవీసీ బ్యానర్లు, అలంకరణ కోసం వాడే పాలిస్ట్రైరిన్‌ (థర్మోకోల్‌) వినియోగాన్ని నిషేధిస్తున్నట్లు వెల్లడించింది. పెట్రోకెమికల్‌ సంస్థలేవీ ప్లాస్టిక్‌ ముడిసరుకును.. ఒకసారి వాడిపారేసే వస్తువులను తయారుచేసే పరిశ్రమలకు సరఫరా చేయవద్దని ఉత్తర్వులు జారీచేసినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏ వాణిజ్య సంస్థా తమ పరిధిలో ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్‌ ఉపయోగించరాదని షరతు విధిస్తూ స్థానిక సంస్థలు లైసెన్సులు జారీచేయాలని పేర్కొంది. ఒకవేళ ఎవరైనా ఉపయోగించినా.. లేదంటే నిషేధిత ప్లాస్టిక్‌ వస్తువులు విక్రయించినా.. వాటి లైసెన్సులు రద్దుచేయాలని స్థానిక సంస్థలకు ఆదేశాలు జారీచేసినట్లు కేంద్ర పర్యావరణ,అటవీ మంత్రిత్వ శాఖ తెలిపింది.

GK National Quiz: 'సెమికాన్ ఇండియా కాన్ఫరెన్స్-2022'ను ప్రధాని నరేంద్ర మోదీ ఎక్కడ

 

Published date : 28 Jun 2022 05:17PM

Photo Stories