Peace Agreement: ఏ రాష్ట్రంలోని వేర్పాటువాదులతో కేంద్రం శాంతి ఒప్పందం చేసుకుంది?
ఢిల్లీలో సెప్టెంబర్ 4న జరిగిన కార్యక్రమంలో ఈ ఒప్పందంపై కేంద్రం, అస్సాం ప్రభుత్వం సంతకాలు చేశాయి. ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. తాజా ఒప్పందంతో కార్బీ అంగ్లాంగ్‌లో ఇక శాశ్వతంగా శాంతి నెలకొంటుందని, అభివృద్ధి పరుగులు పెడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
శాంతి ఒప్పందంపై కార్బీ లోంగ్రీ నార్త్ చచార్ హిల్స్ లిబరేషన్ ఫ్రంట్, పీపుల్స్ డెమొక్రటిక్ కౌన్సిల్ ఆఫ్ కార్బీ లోంగ్రీ, యునైటెడ్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ, కార్బీ పీపుల్స్ లిబరేషన్ టైగర్స్ తదితర వేర్పాటువాద సంస్థలు సంతకాలు చేశాయి. ఆయా సంస్థలకు చెందిన 1,000 మంది వేర్పాటువాదుల తమ ఆయుధాలతో సహా ఇప్పటికే లొంగిపోయారు. జనజీవన స్రవంతిలో కలిసిపోయారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : అస్సాం రాష్ట్రానికి చెందిన ఐదు వేర్పాటువాద సంస్థలతో శాంతి ఒప్పందం
ఎప్పుడు : సెప్టెంబర్ 4
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : అస్సాంలోని కార్బీ అంగ్లాంగ్ ప్రాంతంలో హింసకు చరమగీతం పాడి, శాంతిని నెలకొల్పడమే లక్ష్యంగా...