Skip to main content

Lok Sabha: పేపర్‌ లీక్‌చేస్తే కోటి ఫైన్‌.. లోక్‌సభలో కేంద్రం బిల్లు

Crore fine if paper is leaked Center Bill in Lok Sabha  Examination fraud prevention legislation presented in Lok Sabha  Lok Sabha session discussing exam irregularities

పోటీ పరీక్షల్లో అక్రమాలకు పాల్పడేవారికి కేంద్రం ఇక చెక్‌ పెట్టనుంది. ప్రశ్నాపత్రాల లీకేజీల వంటి వ్యవస్థీకృత నేరాలను అడ్డుకునేందుకు ఉద్దేశించిన పబ్లిక్‌ ఎగ్జామినేషన్‌ (ప్రివెన్షన్‌ ఆఫ్‌ అన్‌ ఫెయిర్‌ మీన్‌ ్స) బిల్లును కేంద్రం ఫిబ్రవరి 5న లోక్‌సభలో ప్రవేశపెట్టింది. కేంద్రమంత్రి జితేందర్‌ సింగ్‌ ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ప్రశ్నాపత్రాల లీకేజీలో పాలు పంచుకునే అధికారులు, లీకేజీకి పాల్పడే ముఠాల ఆగడాలకు ఈ బిల్లుతో కళ్లెం వేయనున్నారు. ఈ బిల్లు చట్టంగా మారిన తర్వాత దీని కింద నేరం రుజువైన వారికి గరిష్టంగా పదేళ్ల జైలు శిక్ష, రూ.కోటి వరకు జరిమానా విధించనున్నారు. రాజస్థాన్‌ , హరియాణా, గుజరాత్, బిహార్‌లో పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పరీక్ష ప్రశ్నపత్రాల లీకేజీల నేపథ్యంలో.. కేంద్రం ఈ బిల్లు తీసుకువచ్చింది. ఈ బిల్లు తీసుకురానున్నట్లు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయసభలను ఉద్దేశించి ఇటీవల చేసిన ప్రసంగంలోనూ ప్రస్తావించారు.

Published date : 14 Feb 2024 10:36AM

Photo Stories