Collegium System: కొలీజియం మన దేశ చట్టం.. అందరూ అనుసరించాల్సిందే: సుప్రీంకోర్టు
Sakshi Education
ఉన్నత న్యాయస్థానాల్లో జడ్జీల నియామకం కోసం ఉద్దేశించిన కొలీజియం వ్యవస్థ అనేది మన దేశ చట్టమని సుప్రీంకోర్టు ఉద్ఘాటించింది.
తాము నిర్దేశించిన ఏ చట్టమైనా భాగస్వామ్యపక్షాలను కలిపి ఉంచుతుందని పేర్కొంది. కొలీజియం వ్యవస్థను కచ్చితంగా అందరూ అనుసరించాల్సిందేనని తేల్చిచెప్పింది. కొలీజియం సిఫార్సు చేసిన పేర్లను కేంద్ర ప్రభుత్వం త్వరగా ఆమోదించకుండా జాప్యం చేస్తుండడాన్ని ప్రశ్నిస్తూ సుప్రీంకోర్టులో పిటిషనల్ దాఖలైంది. దీనిపై జస్టిస్ ఎస్.కె.కౌల్ నేతృత్వంలోని ధర్మాసనం డిసెంబర్ 8న విచారణ చేపట్టింది. కొలీజియంపై కేంద్ర మంత్రులు, ప్రభుత్వ పెద్దలు చేస్తున్న వ్యాఖ్యలను తాము పట్టించుకోవడం లేదని స్పష్టం చేసింది.
Published date : 09 Dec 2022 04:01PM