Skip to main content

New Districts: రాజస్తాన్‌లో 19 కొత్త జిల్లాలు

రాజస్తాన్‌లో కొత్తగా 19 జిల్లాలను, మూడు డివిజన్లను ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్ మార్చి 17న‌ అసెంబ్లీలో ప్రకటించారు.
Rajasthan Chief Minister Ashok Gehlot

దీంతో రాష్ట్రంలో జిల్లాల సంఖ్య 50కి చేరనుంది. 
• 2008 తర్వాత రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు ఇదే తొలిసారి. కొత్త జిల్లాల్లో అత్యధికంగా జైపూర్‌లో నాలుగు జిల్లాలు, జోథ్‌పూర్‌లో మూడు ఏర్పాటు కానున్నట్టు గహ్లోత్‌ వెల్లడించారు. 
• కొత్త జిల్లాలు, డివిజన్లలో మౌలిక వసతులు, మానవ వనరుల కల్పనకు బడ్జెట్‌లో రూ.2 వేల కోట్లు కేటాయించామన్నారు. 
• విస్తీర్ణపరంగా దేశంలో రాజస్తాన్‌ అతిపెద్ద రాష్ట్రం.

వీక్లీ కరెంట్ అఫైర్స్ (International) క్విజ్ ( 12- 18 ఫిబ్రవరి 2023 )

Published date : 20 Mar 2023 01:16PM

Photo Stories