Environmental Program Report: కర్బన ఉద్గారాల కట్టడిలో భారత్ భేష్
Sakshi Education
పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకత గురించి ధనిక దేశాలు చెబుతున్న మాటలకు, వాటి ఆచరణకు ఏ మాత్రం పొంతనలేదని మరోసారి రుజువైంది.
భూతాపానికి కారణమవుతున్న కర్బన ఉద్గారాల(గ్రీన్‌హౌస్ గ్యాస్) విడుదల ధనిక దేశాల్లోనే అత్యధికంగా ఉంటోందని ఐక్యరాజ్యసమితి(ఐరాస) పర్యావరణ కార్యక్రమ నివేదిక స్పష్టం చేసింది. 2020లో కర్బన ఉద్గారాల ప్రపంచ తలసరి 6.3 టన్నులు (కార్బన్ డై ఆక్సైడ్ ఈక్వలెంట్) కాగా భారత్ సగటు 2.4 టన్నులు మాత్రమేనని వెల్లడించింది. ఈజిప్టులో ఐరాస పర్యావరణ సదస్సు (కాప్27)ను పురస్కరించుకుని ‘ఎమిషన్స్ గ్యాప్ రిపోర్ట్ 2022: క్లోజింగ్ విండో’ పేరుతో ఓ నివేదిక విడుదలైంది.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
Published date : 11 Nov 2022 05:24PM