Goods and Service Tax: రూ.86,912 కోట్ల జీఎస్‌టీ బకాయిల విడుదల
రాష్ట్రాలకు చెల్లించాల్సిన వస్తు, సేవల పన్ను(జీఎస్‌టీ) బకాయిలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. మే 31, 2022 వరకు మొత్తం రూ.86,912 కోట్ల బకాయిలను ఒకేసారి విడుదల చేసినట్లు కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ వెల్లడించింది. జీఎస్‌టీ అమలువల్ల ఏర్పడే రెవెన్యూ లోటును పూడ్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వం వీటిని రాష్ట్రాలకు అందిస్తోంది. మూలధన వ్యయంతోపాటు ఆర్థిక వనరుల నిర్వహణ, వివిధ కార్యక్రమాల అమలుకు తాజా నిర్ణయం దోహదపడుతుందని ఆర్థిక శాఖ తెలిపింది. దేశంలో వస్తు, సేవల పన్ను(జీఎస్‌టీ)ని జూలై 1, 2017లో ప్రవేశపెట్టారు. జీఎస్‌టీ అమలు వల్ల ఏర్పడే రెవెన్యూ లోటు భర్తీకి ఆయా రాష్ట్రాలకు రెండు నెలలకోసారి కేంద్రం పరిహారం చెల్లించాలని 2017 జీఎస్‌టీ చట్టం చెబుతోంది. 2017 నుంచి ఐదేళ్ల పాటు ఈ సహాయాన్ని అందజేయాల్సి ఉంది. ఈ ఏడాది(2022) జూన్ తో ఈ గడువు ముగియనుంది.
Frauds in Banks: బ్యాంకింగ్‌లో 51 శాతం తగ్గిన మోసాలు