ITBP Battalions: కీలక నిర్ణయం.. చైనా బార్డర్లో ఏడు బెటాలియన్లు
కొత్త బెటాలియన్లు, సిబ్బందికి సంబంధించిన నిర్ణయానికి కేంద్ర కేబినెట్ ఫిబ్రవరి 15వ తేదీ ఆమోదముద్ర వేసింది. భారత్–చైనా వాస్తవాధీన రేఖ వెంట సరిహద్దు భద్రత చూసే ఇండో–టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ)లోకి మరో 9,400 మందిని నియమించనున్నారు. వీరు బోర్డర్ బేస్ వద్ద విధులు నిర్వహించనున్నారు. మరో ఏడు బెటాలియన్ల మంజూరుకూ ప్రధాని మోదీ నేతృత్వంలోని భద్రతాంశాలపై కేబినెట్ కమిటీ ఆమోదముద్ర వేసింది.
కొత్త సిబ్బందిని 47 నూతన బోర్డర్ పోస్ట్‌లు, డజను ‘స్టేజింగ్ క్యాంప్’లు/ ట్రూప్ బేస్‌లలో నియోగించనున్నారు. ఇవి చాలావరకు అరుణాల్ ప్రదేశ్‌లో ఏర్పాటవుతాయి. కొత్త బెటాలియన్లు, సెక్టార్ ప్రధానకార్యాలయాన్ని 2025–26కల్లా ఏర్పాటుచేస్తారు. సిబ్బంది స్థావరాలు, ఆఫీస్, నివాస గృహాల కోసం రూ.1,808 కోట్లు, ఏటా నిర్వహణకు రూ.964 కోట్లు ఖర్చుకానుంది. 2020 ఏడాది నుంచి లద్దాఖ్‌లో ఇరు దేశాల సైనిక మొహరింపు పెరిగిన విషయం విదితమే. ప్రస్తుతం భారత్–చైనా వాస్తవాధీన రేఖ వెంట 176 బోర్డర్ పోస్ట్‌లు ఉన్నాయి.