Skip to main content

Amit Shah: అంగుళం కూడా వదలం.. అమిత్‌ షా

మోదీ ప్రధానిగా ఉన్నంతకాలం భారత భూభాగంలో ఎవరూ ఒక్క అంగుళం కూడా ఆక్రమించలేరని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ప్రకటించారు. ఎలాంటి చొరబాట్లనూ అనుమతించబోమన్నారు.

‘లోక్‌సభలో కార్యకలాపాలను కాంగ్రెస్‌ పదేపదే అడ్డుకోవడానికి అసలు కారణం తవాంగ్‌ రగడ కాదు. రాజీవ్‌గాంధీ ఫౌండేషన్‌ (ఆర్జీఎఫ్‌)కు విదేశీ విరాళాల చట్టం (ఎఫ్‌సీఆర్‌ఏ) గుర్తింపును కేంద్రం రద్దు చేయడమే!’’ అంటూ చురకలంటించారు. ‘‘సమాజ సేవ కోసమంటూ నమోదు చేసుకున్న ఆర్జీఎఫ్‌కు ఇండో–చైనా సంబంధాల అభివృద్ధి సంబంధిత అధ్యయనం పేరిట చైనా ఎంబసీ నుంచి రూ.1.35 కోట్లు అందాయి. అందుకే దాని గుర్తింపు రద్దు చేయాల్సి వచ్చింది. విపక్షాల గొడవ వల్ల ప్రశ్నోత్తరాలు తుడిచిపెట్టుకుపోయాయి. లేదంటే ఈ విషయాన్ని సభలోనే చెప్పేవాన్ని. బహుశా ఆర్జీఎఫ్‌ తన అధ్యయనం ముగించే ఉంటుంది. ఇంతకూ, 1962 చైనా యుద్ధంలో ఎన్ని వేల హెక్టార్ల భారత భూ భాగాన్ని చైనా ఆక్రమించిందన్నది ఆ అధ్యయనంలో ఉందా?’’ అంటూ ఎద్దేవా చేశారు.

Mann Ki Baat: ‘అంతరిక్షం’లో నూతన సూర్యోదయం.. మన్‌కీ బాత్‌లో మోదీ
చైనాపై మోదీ ప్రభుత్వం మెతక వైఖరి ప్రదర్శిస్తోందన్న కాంగ్రెస్‌ విమర్శలను తిప్పికొట్టారు. నిజానికి విదేశీ నాయకులతో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వాధినేతలకు ఉన్న వ్యక్తిగత సంబంధాల కారణంగానే ఐరాస భద్రతా మండలిలో స్థానం చేజారిందంటూ ప్రత్యారోపణ చేశారు. ‘‘భద్రతా మండలిలో భారత్‌ స్థానాన్ని కాంగ్రెస్‌కు చెందిన దేశ తొలి ప్రధాని నెహ్రూ ఎందుకు ‘త్యాగం’ చేశారు? కాంగ్రెస్‌ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ అరుణాచల్‌ప్రదేశ్‌లో పర్యటిస్తే చైనా అభ్యంతరపెట్టింది. ఆ రాష్ట్ర సీఎం దోర్జీ ఖండూకు వీసా నిరాకరించింది. జమ్మూ కశ్మీర్‌ను ప్రత్యేక దేశంగా గుర్తిస్తూ అక్కడి ప్రజలకు స్టేపుల్‌ వీసాలిచ్చింది. వీటన్నింటిపై కూడా ఆర్జీఎఫ్‌ అధ్యయనం చేసిందా?’’ అంటూ ఎద్దేవా చేశారు. సోనియాగాంధీ సారథ్యంలోని ఆర్జీఎఫ్‌కు ఉగ్రవాదులతో లింకుల ఆరోపణలపై నిషేధం ఎదుర్కొంటున్న ఇస్లామిక్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు జకీర్‌ నాయక్‌ నుంచి కూడా రూ.50 లక్షలందాయని ఆరోపించారు. 

➤ ఫిఫా వరల్డ్‌కప్ వెనుక ఉన్న కథ ఇదే.. ఇప్ప‌టి వ‌ర‌కు విజేతలుగా నిలిచిన జ‌ట్లు ఇవే..
 

Published date : 14 Dec 2022 12:25PM

Photo Stories