Skip to main content

Ban on Single-use Plastic: సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌పై... నిషేధం అమల్లోకి

Ban on single-use plastic on July 1
Ban on single-use plastic on July 1

న్యూఢిల్లీ: సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌పై నిషేధం జులై 1 నుంచి అమల్లోకి వచ్చింది. రీ సైక్లింగ్‌ చేసే పరిస్థితి లేకపోవడంతో 100 మైక్రోన్ల కంటే తక్కువ మందం కలిగిన ప్లాస్టిక్‌ వస్తువలన్నింటిపైనా కేంద్రం నిషేధం విధించింది. ఈ మేరకు రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. దీనిపై ప్రజల్లో అవగాహన పెంచేలా విస్తృతంగా ప్రచారం చేయాలని రాష్ట్రాలను ఆదేశించింది. సామాజిక మాధ్యమాలు, కాలేజీలు, స్కూళ్లలో ప్లాస్టిక్‌ ఎంత హానికరమో ప్రచారం చేయాలని తెలిపింది. ప్లాస్టిక్‌ స్టిక్స్‌ ఉన్న ఇయర్‌ బడ్స్, బెలూన్లు, ప్లాస్టిక్‌ జెండాలు, ప్లాస్టిక్‌ పుల్ల ఐస్‌క్రీమ్‌లు, ప్లేట్స్, బ్యాగ్‌లు, కప్పులు, ఫోర్కులు, స్వీటు బాక్సుల్ని చుట్టే కవర్లతో సహా వివిధ వస్తువుల్ని నిబంధనలు ఉల్లంఘించి ఈ వస్తువులు ఎవరు తయారు చేసినా,  వినియోగించినా ఐదేళ్ల జైలు, రూ.లక్ష జరిమానా విధించే అవకాశముంది. ఢిల్లీలో జులై 10 తర్వాత ఈ ప్లాస్టిక్‌ వాడితే శిక్షలు, జరిమానాలు అమల్లోకి వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.

ప్రత్యామ్నాయం ఇదీ..! 
ప్లాస్టిక్‌కు చౌక ప్రత్యామ్నాయాలుగా కాగితం, జనపనార, కర్ర, మట్టి, స్టీల్‌ తదితరాల తయారీకి చిన్న తరహా పరిశ్రమలు ఇప్పటికే శ్రీకారం చుట్టాయి. అయితే వెదురు కర్రతో చేసే వస్తువులు అన్నింటికంటే అత్యుత్తమైన ప్రత్యామ్నాయమని నిపుణులు సూచిస్తున్నారు.
 

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 02 Jul 2022 06:50PM

Photo Stories