Skip to main content

Election Commissioner: ఎన్నికల కమిషనర్‌గా అరుణ్‌ గోయల్ బాధ్య‌త‌లు

కేంద్ర నూతన ఎన్నికల కమిషనర్‌ (ఈసీ)గా అరుణ్‌ గోయల్‌ నవంబర్‌ 21న బాధ్యతలు స్వీకరించారు. 1985 పంజాబ్‌ కేడర్‌ రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి అయిన గోయల్‌ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో వివిధ హోదాల్లో పనిచేశారు.

కేంద్ర భారీ పరిశ్రమల శాఖ కార్యదర్శిగా ఉన్న అరుణ్‌ గోయల్‌ ఈ నెల 18న స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. నవంబర్‌ 19న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గోయల్‌ను ఎన్నికల కమిషనర్‌గా నియమించిన విషయం తెలిసిందే.

దేశంలో 2.5 లక్షల మందికిపైగా శతాధిక వయోవృద్ధ ఓటర్లు

Published date : 22 Nov 2022 01:33PM

Photo Stories