AC without electricity: విద్యుత్తు అవసరం లేని ఏసీ
వేడి నుంచి ఉపశమనం పొందడానికి నేడు ఏసీలు అనివార్యమయ్యాయి. అయితే వీటి వాడకం వల్ల కరెంటు బిల్లు తడిసిమోపెడవుతోంది. పైగా విద్యుత్తు కోతల సమయంలో ఈ శీతల యంత్రాలు పనిచేయవు. గువాహటిలోని ఐఐటీ శాస్త్రవేత్తలు దీనికి చక్కటి పరిష్కారాన్ని చూపారు. చౌకైన ‘రేడియేటివ్‌కూలర్‌పూత’ పదార్థాన్ని అభివృద్ధి చేశారు. దీన్ని ఇంటిపైకప్పులకు వేస్తే కరెంటు అవసరం లేకుండానే చల్లదనం అందిస్తుంది. ఇలాంటి విధానాలను ‘పాసివ్ రేడియేటివ్ కూలింగ్’గా పేర్కొంటారు. ఇవి సమీప ప్రాంతాల నుంచి వేడిని గ్రహించి, దాన్ని పరారుణ రేడియోధార్మికత రూపంలో వాతావరణంలోకి విడుదల చేస్తాయి. ఆ రేడియోధార్మికత భూ వాతావరణం ద్వారా ప్రయాణించి, చల్లగా ఉండే అంతరిక్షంలోకి చేరుతుంది. పాసివ్ రేడియేటివ్ కూలర్లు రాత్రివేళ మాత్రమే పనిచేస్తాయి. పగటి సమయంలోనూ ఉపయోగపడాలంటే.. ఈ కూలర్లు సౌర రేడియోధార్మికత మొత్తాన్నీ పరావర్తనం చెందించాలి.
GK National Quiz: దేశంలో మొట్టమొదటి తేనె గ్రామంగా (honey village) అవతరించినది?
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP