Presidential polls: రాష్ట్రపతి ఎన్నికలో 99 శాతం ఓటింగ్
దేశ 15వ రాష్ట్రపతి ఎన్నికలకు జూలై 18న పోలింగ్ జరిగింది. నామినేటెడ్ సభ్యులు, ఎమ్మెల్సీలు మినహా ఎంపీలు పార్లమెంటులో, ఎమ్మెల్యేలు రాష్ట్రాల అసెంబ్లీల్లో దేశవ్యాప్తంగా మొత్తం 31 కేంద్రాల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. పార్లమెంటు హౌస్‌లోని 63వ నంబరు గదిలో ఉదయం పోలింగ్ మొదలవగానే ప్రధాని నరేంద్ర మోదీ ఓటు వేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ, పార్టీ నేత రాహుల్‌గాంధీ తదితరులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. 99 శాతం ఓటింగ్ నమోదైనట్టు రిటర్నింగ్ అధికారి పీసీ మోదీ ప్రకటించారు. 727 మంది ఎంపీలు, 9 మంది ఎమ్మెల్యేలకు పార్లమెంటు హౌస్‌లో ఓటింగ్‌కు అనుమతి ఉండగా 8 మంది ఎంపీలు ఓటేయలేదని వివరించారు.
Also read: Daily Current Affairs in Telugu: 2022, జులై 18th కరెంట్ అఫైర్స్
776 మంది ఎంపీలు, 4,033 మంది ఎమ్మెల్యేలు కలిపి మొత్తం 4,809 మందికి గాను 4,786 మంది ఓటేశారు. అధికార ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ముకు ఇప్పటికే 60 శాతానికి పైగా మద్దతు సమకూరిన నేపథ్యంలో ఆమె గెలుపు లాంఛనమే కానుంది. విపక్షాల తరఫున సీనియర్ నాయకుడు యశ్వంత్ సిన్హా బరిలో ఉన్న విషయం తెలిసిందే.
also read: Weekly Current Affairs (International) Bitbank: మంకీపాక్స్ క్వారంటైన్‌ను ప్రవేశపెట్టిన మొదటి దేశం ఏది
పీపీఈ కిట్‌లో నిర్మల ఓటు
కరోనాతో బాధపడుతున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పూర్తిస్థాయి పీపీఈ కిట్ ధరించి ఓటేశారు. ఇండొనేసియాలోని బాలిలో జీ20 దేశాల ఆర్థిక మంత్రుల భేటీలో పాల్గొన్న సందర్భంగా ఆమె కరోనా బారిన పడ్డట్టు అధికారులు చెప్పారు. మరో కేంద్ర మంత్రి ఆర్‌కే సింగ్ కూడా పీపీఈ కిట్ ధరించి వచ్చి ఓటేశారు.
Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP