Skip to main content

14th Periodic Labour Force Survey: 14వ కార్మిక శక్తి సర్వే

14th Periodic Labour Force Survey released by NSO
14th Periodic Labour Force Survey released by NSO

దేశంలో నిరుద్యోగం(15ఏళ్లు, అంతకుమించి) ఈ ఏడాది మొదటి మూడు నెలల కాలంలో(జనవరి–మార్చి) 8.2 శాతానికి తగ్గింది. 2021 మొదటి మూడు నెలల్లో 9.3 శాతంగా ఉంది. జాతీయ గణాంక కార్యాలయం(ఎన్‌ఎస్‌వో) నిర్వహించిన ‘14వ కార్మిక శక్తి సర్వే’లో ఈ వివరాలు వెల్లడయ్యాయి. 2021లో మొదటి 3 నెలల్లో నిరుద్యోగం ఎక్కువగా ఉండడానికి కరోనా నియంత్రణ కోసం దీర్ఘకాలం పాటు విధించిన లాక్‌డౌన్‌ ల ప్రభావం ఉంది. ఇక గతేడాది చివరి మూడు నెలల్లో (2021 అక్టోబర్‌–డిసెంబర్‌) నిరుద్యోగం 8.7 శాతంగా ఉంది. అంటే.. త్రైమాసికం వారీగా చూసినా ఉపాధిలేని వారి సంఖ్య తగ్గుముఖం పట్టినట్టు తెలుస్తోంది. 

  • మహిళల్లో నిరుద్యోగ రేటు 2022 జనవరి–మార్చి మధ్య 10.1 శాతంగా ఉంది. ఏడాది క్రితం ఇదే కాలంలో ఇది 11.8 శాతం. 2021 చివరి త్రైమాసికంలో 10.5 శాతంగా ఉంది.
  • పురుషుల్లో ఉపాధి లేకుండా ఉన్న వారి రేటు 2022 మొదటి త్రైమాసికంలో 7.7శాతానికి తగ్గింది. అంతక్రితం త్రైమాసికంలో ఇది 8.3 శాతంగా ఉంది. ఇక ఏడాది క్రితం ఇదే కాలంలో 8.6 శాతంగా ఉంది. 
  • పట్టణాల్లో నిరుద్యోగ రేటు 47.3 శాతానికి తగ్గింది. ఏడాది క్రితం ఇదే కాలంలో ఇది 47.5 శాతంగా ఉంది. గతేడాది చివరి త్రైమాసికంలోనూ ఇది 47.3 శాతంగా నమోదైంది.

GK National Quiz: ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్రంలోని ప్రతి ఇంటికి 300 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను ప్రకటించారు?

Published date : 28 Jun 2022 05:33PM

Photo Stories