Zimbabwe to issue gold coins: బంగారు నాణేలు ముద్రించనున్న జింబాబ్వే
Sakshi Education
తీవ్ర ద్రవ్యోల్బణంతో కొట్టుమిట్టాడుతున్న జింబాబ్వే ఓ సంచలన నిర్ణయం తీసుకొంది. ధరల పెరుగుదలను అదుపు చేసేందుకు ఏకంగా బంగారు నాణేలను ముద్రించాలని నిర్ణయించింది. దీంతోపాటు వచ్చే ఐదేళ్లలో అమెరికా డాలర్‌ను కరెన్సీగా వాడాలనే ప్రతిపాదనలను పరిశీలిస్తోంది. దేశంలో ద్రవ్యోల్బణం 190 శాతాన్ని మించిపోవడంతో ఇటీవల అక్కడి కేంద్ర బ్యాంక్ వడ్డీ రేట్లను రెండు రెట్లు పెంచింది. మరోవైపు జింబాబ్వే డాలర్ విలువ గణనీయంగా పతనమవుతోంది. దీంతో జూలై 25వ తేదీ నుంచి 22క్యారెట్ల స్వచ్ఛతతో కూడిన ఒక ట్రాయ్‌ఔన్స్ బరువున్న బంగారు నాణేలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు జింబాబ్వే పేర్కొంది.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
Published date : 16 Jul 2022 06:20PM