Skip to main content

World Health Organization: కొత్త రకం కరోనా వేరియంట్‌ బి.1.1.529కు ఏ పేరు పెట్టారు?

Omicron

ఇటీవల ఆఫ్రికా ఖండంలో బయటపడిన కొత్త రకం కరోనా వేరియంట్‌ బి.1.1.529 దక్షిణాఫ్రికా, హాంకాంగ్, బెల్జియం, ఇజ్రాయెల్‌కు సైతం విస్తరించింది. ఇది అత్యధిక వేగంతో వ్యాప్తిచెందే వేరియంట్‌ అని సమాచారం అందుతుండడంతో ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి. నియంత్రణ చర్యలు ప్రారంభించాయి. కొత్త వేరియంట్‌ వ్యాప్తిని అడ్డుకోవడానికి ఆఫ్రికా ఖండం దక్షిణ ప్రాంతం నుంచి విమాన ప్రయాణాలపై నిషేధానికి 27 దేశాల యూరోపియన్‌ యూనియన్‌ కూటమి అంగీకరించింది. బి.1.1.529 వ్యాప్తి వల్ల నెలకొన్న ఆందోళనల నేపథ్యంలో... ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో స్టాక్‌మార్కెట్లు కుప్పకూలాయి. ముడి చమురు ధరలు పెరిగాయి.

ఒమీక్రాన్‌గా నామకరణం

బి.1.1.529 వేరియంట్‌పై ప్రపంచమంతటా ఆందోళన వ్యక్తమవుతుండడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) సాంకేతిక సలహాదారుల బృందం నవంబర్ 27న ప్రత్యేకంగా భేటీ అయ్యింది. రూపాంతరం చెందిన వైరస్‌ లక్షణాలు, వ్యాప్తి తీరుపై చర్చించింది. బి.1.1.529 వేరియంట్‌కు ‘ఒమీక్రాన్‌’గా నామకరణం చేసింది. దీనిని ‘వేరియంట్‌ ఆఫ్‌ కన్సర్న్‌’గా నిర్ధారించింది.

చ‌ద‌వండి: ప్రస్తుతం ఫిలిప్పైన్స్‌ అధ్యక్షుడిగా ఎవరు ఉన్నారు?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : కొత్త రకం కరోనా వేరియంట్‌ బి.1.1.529కు ‘ఒమీక్రాన్‌’గా నామకరణం
ఎప్పుడు  :నవంబర్ 26
ఎవరు    : ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) సాంకేతిక సలహాదారుల బృందం
ఎందుకు  : బి.1.1.529 వేరియంట్‌ను సులభంగా గుర్తించుకునేందుకు..

డౌన్‌లోడ్‌చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌చేసుకోండి.

యాప్‌డౌన్‌లోడ్‌ఇలా...
డౌన్‌లోడ్‌వయా గూగుల్‌ప్లేస్టోర్‌

Published date : 27 Nov 2021 12:50PM

Photo Stories