Skip to main content

Ukraine-Russia Conflict: ఉక్రెయిన్‌ సంక్షోభ పరిష్కారానికి భారత్‌తో కలిసి పని చేస్తాం

జీ20 సదస్సు ఆతిథ్య దేశంగా భారత్‌ ప్రత్యేకమైన పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని అమెరికా అభిప్రాయపడింది.
US State Department spokesperson Ned Price

ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని ముగించడానికి రష్యాతో తనకున్న చిరకాల సత్సంబంధాలను భారత్‌ వినియోగించుకోవాలని చెప్పింది. ఈ సంక్షోభాన్ని వీలైనంత త్వరగా ముగించడానికి తాము కూడా సహకారం అందిస్తామని హామీ ఇచ్చింది. జీ20 విదేశాంగ శాఖ మంత్రుల సమావేశం ఉక్రెయిన్‌ యుద్ధంపై ఏకాభిప్రాయానికి రావడంలో విఫలమైన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నెడ్‌ ప్రైస్‌ విలేకరులతో మాట్లాడుతూ జీ20 సదస్సు ప్రారంభమయ్యే లోపు ఉక్రెయిన్‌ యుద్ధంపై ఒక పరిష్కార మార్గం దొరుకుతుందని ఆశిస్తున్నట్టుగా తెలిపారు. ఇందుకోసం విదేశాంగ మంత్రుల సమావేశంలో భారత్‌ ఒక దారి చూపించిందని ఈ ఏడాది కాలంలో ఇంకా చేయాల్సింది చాలా ఉందని అన్నారు. 

వీక్లీ కరెంట్ అఫైర్స్ (International) క్విజ్ (29 జనవరి - 04 ఫిబ్రవరి 2023)

Published date : 04 Mar 2023 01:18PM

Photo Stories