Skip to main content

UN General Assembly: ఉక్రెయిన్‌పై దాడి తీర్మానానికి ఎన్ని దేశాలు అనుకూలంగా ఓటేశాయి?

UN General Assembly

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని ఐక్యరాజ్యసమితి తీవ్రంగా ఖండించింది. ఉక్రెయిన్‌ స్వాతంత్య్రాన్ని, సార్వభౌమత్వాన్ని, ఐక్యతను, ప్రాదేశిక సమగ్రతను కాపాడేందుకు కట్టుబడి ఉంటామని పునరుద్ఘాటించింది. మార్చి 2న జరిగిన ఐరాస జనరల్‌ అసెంబ్లీ 76వ ‘అసాధారణ’ సర్వసభ్య సమావేశం ఈ మేరకు తీర్మానం చేసింది. ‘ఉక్రెయిన్‌పై దాడి’ పేరుతో రూపొందిన తీర్మానానికి మొత్తం 193 సభ్య దేశాల్లో 141 దేశాలు అనుకూలంగా ఓటేశాయి. ఐదు దేశాలు వ్యతిరేకించాయి. ఓటింగ్‌కు భారత్‌ దూరంగా ఉంది. దౌత్యం, చర్చలు తప్ప వివాద పరిష్కారానికి మరో మార్గం లేదని భారత్‌ ఈ సందర్భంగా అభిప్రాయపడింది. మొత్తం 35 దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి.

15 మంది సభ్యుల ఐరాస భద్రతా మండలిలోనూ ఫిబ్రవరి 28న ఇలాంటి తీర్మానాన్నే ప్రవేశపెట్టగా రష్యా వీటో చేయడం తెలిసిందే. దాంతో మార్చి 2న జనరల్‌ అసెంబ్లీ అత్యవసర ప్రత్యేక సమావేశం నిర్వహించింది. రష్యాకు బెలారస్‌ మద్దతును కూడా ఐరాస తీవ్రంగా తప్పుబట్టింది.

Russia-Ukraine War: యూఎన్‌హెచ్‌ఆర్‌సీ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 03 Mar 2022 12:11PM

Photo Stories