Mystery Virus: మిస్టరీగా కొత్త వైరస్.. 24 గంటల్లో ముగ్గురు మృతి!
ఆఫ్రికా ఖండంలోని బురుండి దేశంలో ఉన్న బజిరోలో కొత్త వైరస్ కలకలం సృష్టిస్తోంది. అంతుచిక్కని ఈ వైరస్ కారణంగా ఒకే రోజులో ముగ్గురు మృత్యువాత పడ్డారు. ఈ వైరస్ సోకిన వారికి ముక్కు నుంచి రక్తస్రావం జరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. ఈ వైరస్ సోకిన వారికి జ్వరం, తలనొప్పి, వాంతులు, ముక్కు నుంచి రక్తస్రావం జరగడం లాంటి లక్షణాలు ఉన్నట్లు స్థానికి వైద్య శాఖ అధికారులు వెల్లడించారు. ఈ వ్యాధి రోగిని త్వరగా చంపేస్తుందని తెలుస్తోంది.
దీంతో రంగంలోకి దిగిన అధికారులు బజిరో పట్టణాన్ని క్వారంటైన్ చేశారు. కాగా, ఇటీవలే బురుండి పక్క దేశమైన టాంజానియాలో మార్‌బర్గ్ అనే వైరస్ వ్యాప్తి జరిగింది. దీంతో, ఇదే వైరస్ కూడా బురుండిలో వ్యాప్తి చెందిందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొత్త వైరస్ వ్యాప్తి నేపథ్యంలో చుట్టుపక్కల దేశాలకు ముప్పు ఉందని, అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది.