Taliban-Western Officials Talks: నార్వే దేశ రాజధాని నగరం పేరు?
అఫ్గానిస్తాన్‌ను స్వాధీనం చేసుకున్న తర్వాత తాలిబన్లు తొలిసారిగా పశ్చిమ దేశాల ప్రతినిధులతో అధికారికంగా సమావేశమై చర్చించారు. నార్వే రాజధాని ఓస్లోలో మూడు రోజుల పాటు జరుగుతున్న సమావేశాల్లో పాల్గొన్న తాలిబన్ ప్రతినిధులు అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు స్తంభింపజేసిన వెయ్యి కోట్ల అమెరికా డాలర్లను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తాలిబన్ల తరఫున హాజరైన షఫీవుల్లా అజామ్ సమావేశంలో మాట్లాడుతూ.. అఫ్గానిస్తాన్ మానవ సంక్షోభం అంచులో ఉందని అందుకే ఆ నిధులు విడుదల చేయాలన్నారు. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ, నార్వే, యూరోపియన్ యూనియన్‌కు చెందిన ప్రతినిధులు ఈ చర్చల్లో పాల్గొన్నారు.
నార్వే..
రాజధాని: ఓస్లో; కరెన్సీ: నార్వేజియన్ క్రోన్
ప్రస్తుత రాజు: హెరాల్డ్ V
ప్రస్తుత ప్రధానమంత్రి: జోనాస్ గహర్ స్టోర్
హౌతీ మిస్సైల్స్ కూల్చేసిన యూఏఈ
యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్(యూఏఈ)రాజధాని నగరం అబుదాబి లక్ష్యంగా హౌతీ తిరుగుబాటుదారులు ప్రయోగించిన రెండు క్షిపణులను మధ్యలోనే పేల్చేసినట్లు ఆ దేశ ప్రభుత్వం జనవరి 24న ప్రకటించింది. ఈ దాడిలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలిపింది. దాడులకు ప్రతీకారంగా యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులకు చెందిన మిప్సైల్ లాంచర్‌ను యూఏఈ రక్షణ వర్గాలు పేల్చేశాయి.
చదవండి: ఆఫ్రికాలోని ఏ దేశాధ్యక్షుడిని సైనికులు బంధించారు?
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్