World Best Stews And Curries: అత్యుత్తమ వంటకాల జాబితాలో.. షాహీ పనీర్, దాల్, కుర్మా!
Sakshi Education
ప్రపంచంలోని అత్యుత్తమ వంటకాల జాబితాలో భారత్ నుంచి ఏకంగా ఎనిమిది వెరైటీలకు చోటు దక్కింది.
Shahi Paneer
టాప్–50 వంటకాల్లో షాహీ పనీర్ ఐదో స్థానంలో నిలిచింది. కీమాకు పదో స్థానం, చికెన్ కుర్మాకు 16, దాల్‌కు 26, గోవా వంటక విందాలూకు 31, వడా పావ్‌కు 39, దాల్ తడ్కాకు 40వ స్థానం లభించాయి. అయితే, 38 స్థానం దక్కిన ప్రపంచ ప్రఖ్యాత భారతీయ వంటకం చికెన్ టిక్కాను బ్రిటిష్ వంటకంగా పేర్కొనడం విశేషం. ప్రపంచ ప్రఖ్యాతి పొందిన పలువురు వంట నిపుణుల పర్యవేక్షణలో ప్రఖ్యాత ఫుడ్ గైడ్ టేస్ట్ అట్లాస్ ఈ జాబితాను రూపొందించింది. థాయ్‌లాండ్ వంటకం హానెంగ్ అగ్రస్థానంలో నిలిచింది. సింగపూర్ వంటకం సిచువాన్, చైనాకు చెందిన హాట్‌పాట్ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.