Russian Jet-US Drone Collision: అమెరికా డ్రోన్‌ను ఢీకొట్టిన రష్యా యుద్ధ విమానం
Sakshi Education
రష్యా యుద్ధ విమానం నల్ల సముద్రంపై అమెరికా నిఘా డ్రోన్‌ను ఢీకొట్టింది.
మార్చి 14న ఈ సంఘటన చోటుచేసుకుంది. దీంతో అమెరికా సైన్యం తమ డ్రోన్‌ను కిందకు దించింది. తమ హెచ్చరికలను లెక్కచేయకుండా ఉక్రెయిన్‌పై దండయాత్ర కొనసాగిస్తున్న రష్యాపై అమెరికా ఇప్పటికే ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. అమెరికా–రష్యా మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా డ్రోన్‌ను రష్యా ఫైటర్ జెట్ ఢీకొట్టడం సంచలనాత్మకంగా మారింది. తాజా సంఘటన గురించి అమెరికా జాతీయ భద్రతా సలహాదారు అధ్యక్షుడు జో బైడెన్‌కు తెలియజేశారు. నల్ల సముద్రంపై అంతర్జాతీయ ఎయిర్‌స్పేస్‌లో రష్యాకు చెందిన రెండు ఎస్‌యూ–27 ఫైటర్ జెట్లు ఎలాంటి రక్షణ లేకుండా విన్యాసాలు చేపట్టాయని, అందులో ఒక విమానం అమెరికాకు చెందిన ఎంక్యూ–9 డ్రోన్‌ను ఢీకొట్టిందని యూఎస్ యూరోపియన్ కమాండ్ ఒక ప్రకటనలో వెల్లడించింది.
Longest Railway Platform: ప్రపంచంలోనే పొడవైన రైల్వే ప్లాట్‌ఫామ్ జాతికి అంకితం
Published date : 15 Mar 2023 12:09PM