Skip to main content

UK Prime Minister Race: బ్రిటన్‌ ప్రధాని రేసులో రిషీ హవా

Rishi Sunak Wins Fourth Round Leadership
Rishi Sunak Wins Fourth Round Leadership

బ్రిటన్‌ ప్రధాని రేసులో భారత సంతతికి చెందిన మాజీ మంత్రి రిషి సునాక్‌ (42) హవా కొనసాగుతోంది. కన్జర్వేటివ్‌ పార్టీ నాయకుని ఎన్నిక ప్రక్రియలో జూలై 19న జరిగిన నాలుగో రౌండ్‌ ఓటింగ్‌ తర్వాత కూడా రిషియే అగ్రస్థానంలో నిలిచారు. ఆయనకు మద్దతిస్తున్న ఎంపీల సంఖ్య 118కి పెరిగింది. కన్జర్వేటివ్‌ ఎంపీల్లో మూడో వంతు మంది మద్దతు, అంటే 120 ఓట్లు సాధించేవారు తుది ఇద్దరు అభ్యర్థుల జాబితాలో నిలుస్తారు. దాంతో రిషి తుది పోటీలో నిలవడం దాదాపుగా ఖాయమైంది. ఆయనతో పాటు తుది పోరులో నిలిచేందుకు వాణిజ్య మంత్రి పెన్నీ మోర్డంట్, విదేశాంగ మంత్రి లిజ్‌ ట్రస్‌ మధ్య హోరాహోరీ సాగుతోంది. రిషికి గట్టి పోటీదారుగా భావిస్తున్న మోర్డాంట్‌ 92 ఓట్లతో రెండో స్థానంలో, ట్రస్‌ 86 ఓట్లతో మూడో స్థానంలో కొనసాగుతున్నారు. నాలుగో అభ్యర్థి కేమీ బదొనెక్‌ 59 ఓట్లతో రేసు నుంచి వైదొలిగారు. దీంతో రిషి, మోర్డంట్, ట్రస్‌ ముగ్గురే పోటీలో మిగిలారు. జూలై 20న ఐదో రౌండ్‌ తర్వాత తుది పోరులో నిలిచే ఇద్దరు ఎవరో తేలుతుంది. జూలై 21 నుంచి వారి మధ్య ముఖాముఖి పోరు సాగుతుంది. వారిలో కన్జర్వేటివ్‌ పారీ్టకి చెందిన 1.6 లక్షల పై చిలుకు సభ్యుల్లో అత్యధికుల మద్దతు కూడగట్టుకునేవారు పార్టీ నేత పదవిని, తద్వారా ప్రధాని పీఠాన్ని దక్కించుకుంటారు. కన్జర్వేటివ్‌ సభ్యుల ఓట్ల లెక్కింపు ఆగస్టు చివరికల్లా పూర్తవుతుంది. విజేతను సెప్టెంబర్ 5న ప్రకటిస్తారు. 

Also read; UBS CEOగా భారత–అమెరికన్‌ నౌరీన్‌(Naureen Hassan)

 Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

Sakshi Education Mobile App

 

Published date : 20 Jul 2022 05:07PM

Photo Stories