Skip to main content

UK Elections: బ్రిటన్‌ ప్రధాని పోరు రిషి X ట్రస్‌

Rishi Sunak and Liz Truss
Rishi Sunak and Liz Truss

భారత మూలాలున్న బ్రిటన్‌ మాజీ మంత్రి రిషి సునాక్‌ (42) చరిత్ర సృష్టించేందుకు మరింత చేరువయ్యారు. బ్రిటన్‌ ప్రధాని పదవిని అధిష్టించే అధికార కన్జర్వేటివ్‌ పార్టీ నేత ఎన్నికకు జరుగుతున్న పార్టీపరమైన పోరులో కీలకమైన తుది అంకానికి అర్హత సాధించారు.  జూలై 20న జరిగిన చివరిదైన ఐదో రౌండ్‌ పోరులో 137 మంది ఎంపీల మద్దతు సాధించి అగ్ర స్థానాన్ని నిలుపుకున్నారు. ప్రధాని పదవికి గట్టి పోటీదారుగా అంతా భావించిన వాణిజ్య మంత్రి పెన్నీ మోర్డంట్‌ అనూహ్యంగా 105 ఓట్లతో మూడో స్థానంలో నిలిచి రేసు నుంచి వైదొలిగారు! నాలుగో రౌండ్‌ దాకా మూడో స్థానంలో కొనసాగిన విదేశాంగ మంత్రి లిజ్‌ ట్రస్‌ కీలకమైన ఐదో రౌండ్‌ ముగిసే సరికి నాటకీయ పరిణామాల మధ్య 113 ఓట్లతో రెండో స్థానానికి ఎగబాకి తుది పోరుకు అర్హత సాధించారు. 

Also read: UK Prime Minister Race: బ్రిటన్‌ ప్రధాని రేసులో రిషీ హవా

రిషి ఇక ట్రస్‌తో ముఖాముఖి తలపడతారు. జూలై 25న ఆమెతో లైవ్‌ డిబేట్‌ ద్వారా అందుకు శ్రీకారం చుట్టనున్నారు. అనంతరం ఆగస్టు 1 నుంచి దాదాపు నెల పాటు దశలవారీగా జరిగే పోలింగ్‌లో 1.6 లక్షల పై చిలుకు కన్జర్వేటివ్‌ పార్టీ సభ్యులు సీక్రెట్‌ బ్యాలెట్‌ పద్ధతిన ఓటింగ్‌లో పాల్గొంటారు. వీటిలో మెజారిటీ ఓట్లు సాధించేవారే కన్జర్వేటివ్‌ పార్టీ నేతగా ఎన్నికవుతారు. తద్వారా ప్రధాని పీఠమూ ఎక్కుతారు. ఈ నేపథ్యంలో కీలకమైన టోరీ సభ్యుల మద్దతు కూడగట్టుకునేందుకు రిషి, ట్రస్‌ త్వరలో దేశవ్యాప్తంగా పర్యటిస్తారు. 

Also read: Weekly Current Affairs (International) Bitbank: మంకీపాక్స్ క్వారంటైన్‌ను ప్రవేశపెట్టిన మొదటి దేశం ఏది?

 Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

Sakshi Education Mobile App

 

Published date : 21 Jul 2022 05:46PM

Photo Stories