Skip to main content

Queen Elizabeth: ఎలిజబెత్‌ అంత్యక్రియలకు ఎంత ఖ‌ర్చ‌యిందో తెలుసా..?

క్వీన్‌ ఎలిజబెత్‌–2 అంత్యక్రియలకు 162 మిలియన్‌ పౌండ్లు (రూ.1,655 కోట్లు) ఖర్చయినట్లు బ్రిటన్‌ కోశాగార విభాగం (ట్రెజరీ) వెల్లడించింది.
Queen Elizabeth

రాణి అంత్యక్రియల ఖర్చులను ట్రెజరీ చీఫ్‌ సెక్రెటరీ జాన్‌ గ్లెన్‌ పార్లమెంట్‌కు సమర్పించారు. 70 ఏళ్ల పాటు బ్రిటన్‌ మహారాణి హోదాలో కొనసాగిన ఎలిజబెత్‌–2 గత ఏడాది సెప్టెంబర్‌ 8న మరణించారు. గత సెప్టెంబర్‌ 19న జరిగిన ఆమె అంత్యక్రియలకు వివిధ దేశాల నేతలు, ప్రతినిధులు హాజరయ్యారు.  

వీక్లీ కరెంట్ అఫైర్స్ (Persons) క్విజ్ (23-29 ఏప్రిల్ 2023)

Published date : 20 May 2023 07:26PM

Photo Stories