Quad Summit 2021: ప్రస్తుతం జపాన్ దేశ ప్రధానమంత్రిగా ఎవరు ఉన్నారు?
అమెరికా రాజధాని నగరం వాషింగ్టన్‌లో సెప్టెంబర్ 24న క్వాడ్(Quadrilateral Security Dialogue-Quad) శిఖరాగ్ర సదస్సు–2021 జరిగింది. నాలుగు దేశాల కూటమైన (అమెరికా, భారత్, జపాన్, ఆస్ట్రేలియా) క్వాడ్ సదస్సులో... స్వేచ్ఛాయుత ఇండో ఫసిఫిక్ విధానంపై, అంతర్జాతీయ భద్రత, వాతావరణ మార్పులు, కోవిడ్‌పై పోరాటం, సాంకేతిక రంగంలో పరస్పర సహకారం వంటి కీలకం అంశాలపై చర్చలు జరిపారు. సదస్సులో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఆస్ట్రేలియా ప్రధానమంత్రి స్కాట్ మోరిసన్, జపాన్ ప్రధాని యోషిహిడే సుగా పాల్గొన్నారు.
ప్రస్తుతం దక్షిణ కొరియా అధ్యక్షుడిగా ఎవరు ఉన్నారు?
గత వైరి వైషమ్యాలను పక్కనబెట్టి స్నేహభావంతో ముందుకొస్తే దక్షిణ కొరియా చర్చలకు సిద్ధంగా ఉన్నామని ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ సోదరి కిమ్ యో జోంగ్ సెప్టెంబర్ 24న ప్రకటించారు. ఉభయ కొరియాలపై ఇకనైనా యుద్ధమేఘాలు తొలగిపోయి శాంతి కపోతాలు ఎగరాలని తాజా ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో ద.కొరియా అధ్యక్షుడు మూన్ జె ఇన్ వ్యాఖ్యానించడంతో ఉ.కొరియా తాజాగా స్పందించింది.
దక్షిణ కొరియా...
రాజధాని: సియోల్; కరెన్సీ: సౌత్ కొరియన్ వన్
ఉత్తర కొరియా...
రాజధాని: ప్యాంగ్ యాంగ్; కరెన్సీ: నార్త్ కొరియన్ వన్
చదవండి: అంతరించిపోతున్న జీవజాలం వివరాలను నమోదు చేసే సంస్థ?
క్విక్ రివ్యూ :
ఏమిటి : క్వాడ్(Quadrilateral Security Dialogue-Quad) శిఖరాగ్ర సదస్సు–2021
ఎప్పుడు : సెప్టెంబర్ 24
ఎవరు : భారత ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్, జపాన్ ప్రధాని యోషిహిడే సుగా
ఎక్కడ : వాషింగ్టన్, అమెరికా
ఎందుకు : స్వేచ్ఛాయుత ఇండో ఫసిఫిక్ విధానంపై, అంతర్జాతీయ భద్రత, వాతావరణ మార్పులు, కోవిడ్‌పై పోరాటం వంటి అంశాలపై చర్చలు జరిపేందుకు...