QS World University Rankings 2024: క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్‌లో ఐఎస్‌బీకి 78వ ర్యాంకు
Sakshi Education
ప్రపంచ దేశాల్లోని అగ్రశ్రేణి మేనేజ్‌మెంట్ కాలేజీల జాబితాతో కూడిన క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్–2024లో హైదరాబాద్‌కు చెందిన ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ) సత్తా చాటింది.
ప్రపంచ టాప్–100 బి–స్కూల్స్ ర్యాంకుల్లో 78వ స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో ఐఐఎం–బెంగళూరు 48వ ర్యాంకుతో టాప్–50లో చోటు సంపాదించగా ఐఐఎం–అహ్మదాబాద్ 53వ ర్యాంకు, ఐఐఎం–కలకత్తా 59వ ర్యాంకు సాధించాయి.
గతేడాది విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లోనూ టాప్–100లో ఈ నాలుగే ఉండటం విశేషం. ఇండోర్, ఉదయ్‌పూర్, లక్నో ఐఐఎంలు 150–200 ర్యాంకింగ్స్ మధ్య నిలవగా ఢిల్లీ, గుర్గావ్ ఐఐఎంలు 200–250 ర్యాంకుల మధ్య నిలిచాయి. అమెరికాకు చెందిన స్టాన్‌ఫోర్డ్ గ్రాడ్యుయేట్ బిజినెస్ స్కూల్ తొలి స్థానంలో నిలిచింది.
Global Hunger Index 2023: ప్రపంచ ఆకలి సూచీ–2023లో 111వ స్థానంలో భారత్
Published date : 27 Oct 2023 01:39PM
Tags
- qs world university rankings 2024
- ISB Hyderabad secured the 78th position in the QS World University Rankings
- ISB Hyderabad
- QS World University Rankings news in telugu
- ISB Hyderabad
- University Rankings
- QS World University Rankings
- higher education
- Indian School of Business
- QS Global Rankings
- 2024 Rankings
- International news
- Sakshi Education Latest News