Eastern Economic Forum: ఈస్ట్రన్ ఎకనమిక్ ఫోరమ్ సమావేశాలు ఏ నగరంలో జరగుతున్నాయి?
భారత్, రష్యాల స్నేహబంధం కాలపరీక్షను తట్టుకొని నిలిచిందని మోదీ కొనియాడారు. యాక్ ఫార్ ఈస్ట్ పాలసీలో భాగంగా 2019లో జరిపిన రష్యా పర్యటనను ఆయన గుర్తు చేసుకున్నారు. రష్యాతో కీలక, నమ్మక వ్యూహాత్మక భాగస్వామ్యం ఏర్పరుచుకోవడంలో ఈ పాలసీ కీలకపాత్ర పోషిస్తుందన్నారు. రష్యా తూర్పు ప్రాంతానికి చెందిన 11 ప్రాంతాల గవర్నర్లను భారత్‌లో పర్యటించాలని మోదీ ఆహ్వానించారు.
క్లైమెట్ బులిటన్ విడుదల...
ఐక్యరాజ్యసమితి వాతావరణ ఏజెన్సీ... ప్రపంచ వాతావరణ సమాఖ్య(డబ్ల్యఎంఓ) సెప్టెంబర్ 3న ఎయిర్ క్వాలిటీ అండ్ క్లైమెట్ బులిటన్‌ను విడుదల చేసింది. ప్రపంచంలో ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో కరోనా నివారణకు విధించిన లాక్‌డౌన్లు, ప్రయాణాలపై ఆంక్షలు పర్యావరణపరంగా సత్ఫలితాలిచ్చినట్లు బులిటిన్ తెలిపింది. 2020 లాక్‌డౌన్ కాలంలో గాలిలోకి వాయు కాలుష్య కారకాల విడుదల భారీగా తగ్గిందని పేర్కొంది.