Korean Border: కొరియాల సరిహద్దుల్లో మళ్లీ ఉద్రిక్తతలు
Sakshi Education
తమ గగనతలంలోకి చొచ్చుకువచ్చిన ఉత్తరకొరియా డ్రోన్లను దక్షిణ కొరియా సైన్యం తరిమి కొట్టింది.

డిసెంబర్ 26న ఉత్తరకొరియా ప్రయోగించిన ఐదు డ్రోన్లలో ఒకటి దక్షిణ కొరియా రాజధాని సియోల్‌కు అత్యంత సమీపంలోకి వచ్చింది. వీటిని పసిగట్టిన ఆర్మీ.. యుద్ధ విమానాలు, హెలికాప్టర్లతో ఆ డ్రోన్లను వెంబడించి 100 రౌండ్ల వరకు కాల్పులు జరిపింది. డ్రోన్లను కూల్చివేసిందీ లేనిదీ దక్షిణ కొరియా ఆర్మీ వెల్లడించలేదు. ఈ ఘటనలో తేలికపాటి యుద్ధ విమానం కేఏ–1 కూలిపోయింది. అందులోని ఇద్దరు పైలట్లు సురక్షితంగా బయటపడినట్లు తెలిపింది. అంతేకాదు, సరిహద్దుల ఆవల ఉత్తర కొరియా భూభాగంలోకి డ్రోన్లను పంపి, అక్కడి మిలటరీ స్థావరాలను చిత్రీకరించినట్లు సమాచారం.
UN Conference: జీవ వైవిధ్య పరిరక్షణే లక్ష్యం.. 200 దేశాల ఆమోదముద్ర
Published date : 27 Dec 2022 05:15PM