Skip to main content

BioAsia 2023: ఆసియాలోనే అతిపెద్ద వేదిక.. బయో ఆసియా–2023 సదస్సు ముఖ్యాంశాలు

‘బయో ఆసియా’ 20వ వార్షిక సదస్సు.. జీవశాస్త్ర, ఆరోగ్య రక్షణ రంగాలకు సంబంధించి ఆసియాలోనే అతిపెద్ద వేదిక.
BioAsia 2023

ఈ సదస్సు ‘బయో ఆసియా 2023’పేరిట, నాణ్యమైన వైద్యం.. అందరికీ ఆరోగ్యం లక్ష్యంగా.. ఫిబ్ర‌వ‌రి 24వ తేదీ నుంచి మూడు రోజుల పాటు హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ (హెచ్‌ఐసీసీ) ప్రాంగణంలో జరుగుతోంది. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు దీనిని ప్రారంభించారు.
‘అడ్వాన్సింగ్‌ ఫర్‌ వన్‌.. షేపింగ్‌ ది నెక్ట్స్‌ జనరేషన్‌ హ్యూమనైజ్డ్‌ హెల్త్‌కేర్‌’అనే నినాదంతో నిర్వహిస్తున్నారు. ప్రతి ఏటా ఇస్తున్న ‘జీనోమ్‌ వ్యాలీ ఎక్స్‌లెన్స్‌’పురస్కారాన్ని ఈసారి ఎంఆర్‌ఎన్‌ఏ టెక్నాలజీపై కృషి చేసిన ప్రొఫెసర్‌ రాబర్ట్‌ లాంగర్‌కు అందజేయనున్నారు.
సదస్సు నిర్వహణలో బ్రిటన్‌ భాగస్వామ్యం వహిస్తుండగా, స్థానిక పార్ట్‌నర్‌గా ప్లాండర్స్‌ వ్యవహరిస్తోంది. ప్రముఖ సంస్థ ‘ఆపిల్‌’ తొలిసారిగా బయో ఆసియా సదస్సులో పాల్గొంటోంది. నోవార్టిస్‌ సీఈఓ వాస్‌ నరసింహన్‌ కీలకోపన్యాసం చేస్తారు. ప్లీనరీ టాక్‌లో యూకేకి చెందిన డా.రిచర్డ్‌ హాచెట్‌ ప్రసంగిస్తారు.

Mahindra EV Plant: తెలంగాణలో రూ.1000 కోట్లతో మహీంద్రా ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్లాంట్

5 ఆవిష్కరణలు వివరించనున్న సార్టప్‌లు
జీవ శాస్త్ర (లైఫ్‌ సైన్సెస్‌) రంగం విలువ, ఉద్యోగాల సంఖ్యను వచ్చే ఐదేళ్లలో రెట్టింపు చేయడం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం బయో ఆసియా సదస్సును నిర్వహిస్తోంది. 2021 నాటికి హైదరాబాద్‌ సహా తెలంగాణలో లైఫ్‌ సైన్సెస్‌ రంగంలో పనిచేస్తున్న కంపెనీల నికర విలువ రూ.50 బిలియన్‌ డాలర్లు కాగా.. 2028 నాటికి 100 బిలియన్‌ డాలర్లకు చేర్చేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ రంగంలో ప్రస్తుతం 4 లక్షలుగా ఉన్న ఉద్యోగుల సంఖ్యను వచ్చే ఐదేళ్లలో రెట్టింపు చేసి 8 లక్షలకు చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 
సుమారు 400 స్టార్టప్‌లు బయో ఆసియాలో తమ ఆవిష్కరణలను ప్రదర్శించేందుకు దరఖాస్తు చేసుకోగా ఇందులో 75 స్టార్టప్‌లను ఎంపిక చేశారు. వీటి నుంచి ఐదింటిని ఎంపిక చేసి నగదు పురస్కారం ఇవ్వడంతో పాటు వాటి ఆవిష్కరణలను వివరించేందుకు అవకాశం ఇస్తారు.

RBI Regional Office: విశాఖలో ఆర్‌బీఐ ప్రాంతీయ కార్యాలయం

ఇప్పటివరకు రూ.25 వేల కోట్ల పెట్టుబడులు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 19 ఏళ్ల క్రితం ప్రారంభమైన బయో ఆసియా సదస్సు రాష్ట్ర విభజన తర్వాత కూడా కొనసాగుతోంది. ఇటీవలి కాలంలో జరిగిన బయో ఆసియా సదస్సుల్లో సత్య నాదెళ్ల వంటి ప్రముఖ కంపెనీల సీఈఓలు, శాస్త్రవేత్తలు, నోబెల్‌ గ్రహీతలు ప్రసంగించగా, 20 వేలకు పైగా భాగస్వామ్య సమావేశాలు జరిగాయి. 250కి పైగా ద్వైపాక్షిక ఒప్పందాలు కుదరగా, రూ.25 వేల కోట్ల పెట్టుబడులు లైఫ్‌ సైన్సెస్, అనుబంధ రంగాల్లోకి వచ్చాయి. 

లైఫ్‌సైన్సెస్‌పై సర్కారు కీలక ప్రకటన!
20వ సదస్సులోనూ ప్రాధాన్యత కలిగిన ద్వైపాక్షిక ఒప్పందాలు కుదిరే అవకాశముందని భావిస్తున్నారు. ఫార్మా సిటీలో లైఫ్‌ సైన్సెస్‌ యూనివర్సిటీ ఏర్పాటు, లైఫ్‌ సైన్సెస్‌ రంగంలో యువతకు నైపుణ్య శిక్షణ, మౌలిక వసతుల కల్పన వంటి అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసే అవకాశముంది.

Telangana: తెలంగాణ రాష్ట్ర అప్పు రూ.2,83,452 కోట్లు.. కేంద్ర ప్రభుత్వం వెల్లడి

Published date : 24 Feb 2023 04:22PM

Photo Stories