Skip to main content

Highest Temperature Record : అత్యధిక ఉష్ణోగ్రత నమోదైన రో­జుగా జూలై 22వ తేదీ!

Copernicus Climate Change Service (C3S) temperature record  Record-breaking global temperature on July 22  July 22 created record by Highest Temperature Since 84 years  July 22nd highest temperature record in 84 years

గత 84 ఏళ్లలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైన రో­జుగా జూలై 22వ తేదీ రికార్డు సృష్టించింది. ఆ రో­జున ప్రపంచ సగటు ఉష్ణోగ్రత 17.15 డిగ్రీ సెల్సియస్‌గా నమోదైనట్టు యూరోపియన్‌ యూనియన్‌­కు చెందిన కోపర్నికస్‌ క్లెమేట్‌ చేంజ్‌ సర్వీస్‌ (సీ3ఎస్‌) తెలిపింది. 1940 తర్వాత అత్యధిక ఉష్ణోగ్రత నమోదైన రోజు జూలై 22 అని సీ3ఎస్‌ తెలిపింది.

India in Third Place : అటవీ విస్తీర్ణంలో మూడ‌వ స్థానంలో నిలిచిన భార‌త్‌..

జూలై 21వ తేదీన 17.09 డిగ్రీల ప్రపంచ సగటు ఉష్ణోగ్రత నమోదు కావడం రికార్డు సృష్టించగా, మరునాడే దీనికి మించి నమోదైందని పేర్కొన్నది. దీనికి ముందు గత ఏడాది జూలై 6న అత్యధికంగా 17.08 డిగ్రీల ప్రపంచ సగటు ఉష్ణోగ్రత నమోదైంది. అప్ప‌టి నుంచి వరుసగా 13 నెలలుగా ప్రతి నెలా ఉష్ణోగ్రతలు రికార్డులు సృష్టిస్తున్నాయని సీ3ఎస్‌ డైరెక్టర్‌ కార్లో బౌన్‌టెంపో తెలిపారు.

US Biosecure Act: అమెరికా చట్టం.. భారత్‌కు లాభం..!

Published date : 30 Jul 2024 01:26PM

Photo Stories