Eric Garcetti: ప్రపంచంలో ఎవ్వరికీ సాధ్యంకానిది భారత దేశానికి సాధ్యమైంది.. అమెరికా రాయబారి
ప్రపంచంలో ఎవ్వరికీ సాధ్యం కాని విధంగా 89.5 మిలియన్ల డిజిటల్ చెల్లింపులతో భారతదేశం పెనుసంచలనం సృష్టించిందన్నారు అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి.
ఇదీ నాయకత్వం అంటే..
జూన్ 13న జరిగిన ఓ సమావేశంలో మాట్లాడుతూ అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి భారతదేశం డిజిటల్ చెల్లింపుల్లోనూ, ఆర్ధిక సాంకేతికతలోనూ ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. ఈ సందర్బంగా ఆయన భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన గురించి, జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ ధోవల్ గురించి ప్రస్తావించారు. మోదీ నాయకత్వంలో భారత దేశం సాంకేతికంగా దూసుకుపోతోందని, త్వరలో జరగబోయే అమెరికా పర్యటనతో మన రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత పటిష్టమవుతాయన్నారు. అజిత్ ధోవల్ గురించి చెబుతూ ఆయన భారత దేశానికి దొరికిన గొప్ప సంపదని అన్నారు.
Colombian children: విమాన ప్రమాదంలో తప్పిపోయిన 40 రోజుల తరువాత మృత్యుంజయులుగా బయటకి వచ్చిన చిన్నారులు..!
ఒప్పందాలు.. పెనుమార్పులు..
ఇక ఇదే కార్యక్రమానికి హాజరైన అమెరికా జాతీయ భద్రతా సలహాదారుడు జేక్ సుల్లివాన్ మాట్లాడుతూ.. భారత ప్రధాని రాక కోసం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఎదురు చూస్తున్నారన్నారు. వచ్చే వారం వాషింగ్టన్‌లో పర్యటించనున్న మోదీ రక్షణ విభాగంలోనూ, వాణిజ్య విభాగంలోనూ అమెరికాతో చేయనున్న ఒప్పందాలు రెండు దేశాల మధ్య అనేక అడ్డంకులను తొలగించి సంబంధాలను మరింత బలోపేతం చేస్తాయన్నారు.